ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Etela Rajender: హైడ్రా భయంతోనే బుచ్చమ్మ ఆత్మహత్య: ఈటల

ABN, Publish Date - Sep 29 , 2024 | 04:13 AM

హైడ్రా భయంతో బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు.

హైదర్‌నగర్‌/మేడ్చల్‌ టౌన్‌, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): హైడ్రా భయంతో బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. శనివారం కూకట్‌పల్లి యాదవ బస్తీలోని బుచ్చమ్మ ఇంటికి వెళ్లి ఆమె మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. బుచ్చమ్మది ఆత్మహత్య కాదని, ముమ్మాటికి రేవంత్‌రెడ్డి సర్కార్‌ చేసిన చర్యల వల్లనే ఆమె చనిపోయిందన్నారు. రేవంత్‌రెడ్డి ప్రజలను ఏడిపించి వారి కన్నీళ్లు చూసిసంతోష పడుతున్నారని మండిపడుతున్నారు.


మూసీ పరివాహక ప్రాంతంలో 50 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లను ఖాళీ చేయాలంటూ అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు. కాగా, ఇటీవల హైదరాబాద్‌ శివారు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి నారాయణ చెరువును హైడ్రా బృందం పరిశీలించింది. ఈ నేపథ్యంలో ఆ చెరువును శనివారం ఈటల సందర్శించి.. పరిసరాల్లో ఇళ్లు నిర్మించుకున్నవారిని కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడు కోల్పోయన నిరుపేదల కన్నీళ్లతో సీఎం రేవంత్‌రెడ్డి సైకో ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించటానికి హైడ్రా డ్రామాను ప్రారంభించారన్నారు.

Updated Date - Sep 29 , 2024 | 04:13 AM