ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఈవీఎంలు మన ఈసీఐఎల్‌వే!

ABN, Publish Date - May 11 , 2024 | 07:30 AM

దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం)లలో 90 శాతం హైదరాబాద్‌లోని ఎలకా్ట్రనిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఈసీఐఎల్‌) రూపొందించినవే.

కుషాయిగూడ, మే 10(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం)లలో 90 శాతం హైదరాబాద్‌లోని ఎలకా్ట్రనిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఈసీఐఎల్‌) రూపొందించినవే. ఈవీఎంలపై పూర్తి హక్కు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)దే. థర్డ్‌ పార్టీ ఇన్‌స్పెక్షన్‌ను ఎలకా్ట్రనిక్స్‌ టెస్ట్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ (ఈటీడీసీ) చేపడుతుంది. 543 ఎంపీ స్థానాలకు గాను 500 చోట్ల ఈసీఐఎల్‌ తయారీ ఈవీఎంలనే వాడుతున్నారు. 2 నెలల కిందటే 6.25 లక్షల పైగా కంట్రోల్‌ యూనిట్లు, 8.39 లక్షల బ్యాలెట్‌ యూనిట్లు, 5.45 లక్షల వీవీ ప్యాట్‌లను ఈసీఐకి సరఫరా చేశారు.

అవసరానికి 12 శాతం అదనంగా ఈవీఎంలను అందించారు. ఇక మిగిలిన లోక్‌సభ 43 సీట్లు, ఏపీ, ఒడిశా, అరుణాచల్‌, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు కావాల్సిన మిషన్లను బెంగళూరులోని భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) తయారుచేసింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల తయారీ, మరమ్మతులకు ఈసీఐఎల్‌లో ప్రత్యేక విభాగం ఉంది. ఎన్నిల తర్వాత తిరిగొచ్చిన ఈవీఎంల నుంచి డేటాకు సంబంధించిన హార్డ్‌ డిస్క్‌ల స్థానంలో కొత్తవి అమర్చి మళ్లీ వినియోగించుకునేలా చేస్తారు.

Updated Date - May 11 , 2024 | 07:30 AM

Advertising
Advertising