KCR: కేసీఆర్ కనిపించడం లేదు.. ఆచూకీ కోసం..
ABN, Publish Date - Oct 06 , 2024 | 07:22 PM
గతేడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది. దీంతో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ ప్ర్తతిపక్షానికి పరిమితమైంది. అయితే కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్‌కు మాత్రమే పరిమితమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు హాజరు కాలేదు. సరికదా.. ఎమ్మెల్యేగా ప్రతిపక్షనేతగా గజ్వేల్ నియోజకవర్గంలో సైతం ఆయన పర్యటించలేదు.
గజ్వేల్, అక్టోబర్ 06: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఆచూకీ తెలుసుకుని నియోజకవర్గ ప్రజల ముందుకు తీసుకు రావాలని పోలీసులకు చేసిన ఫిర్యాదులో స్పష్టం చేశారు. అనంతరం గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు మాట్లాడుతూ... కేసీఆర్ మీరెక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వారం రోజుల్లో జాడ తెలుపక పోతే.. తామే కేసీఆర్ ఆచూకీ తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు.
Also Read: Etela Rrajender: సీఎం రేవంత్‌కి ఎంపీ ఈటల ఘాటు లేఖ
ఎన్నికల్లో గెలిచి దాదాపు పది మాసాలు అవుతున్నా.. నేటికి గజ్వేల్ నియోజకవర్గంలో మీ జాడ లేదంటూ కేసీఆర్‌కు సూచించారు. ఎమ్మెల్యేగా మీ బాధ్యతలను మరిచవా కేసీఆర్? అని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును వేతనంగా తీసుకుంటున్నావంటూ ఈ సందర్భంగా కేసీఆర్‌కు శ్రీకాంత్ రావు గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజల కాలిలో ముల్లు దిగితే పంటితో తీస్తనన్నావు కదా.. ఆ విషయం మరిచారా? అంటూ మాజీ సీఎం కేసీఆర్‌కు చురకలంటించారు. మీ యోగ క్షేమాలు తెలుసుకోవాల్సిన బాధ్యత నిన్ను గెలిపించిన ప్రజలకు ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
Also Read: Hyderabad: సీఎం చంద్రబాబుతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ
మాజీ సీఎం కేసీఆర్ ఆచూకీ తెలుసుకుని ప్రజలకు తెలపాలని పోలీస్ అధికారులకు ఆయన విజ్జప్తి చేశారు. నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమ పనులు అసంపూర్తిగా మిగిలాయని ఆయన తెలిపారు. వాటి గురించి ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నిస్తారని ప్రశ్నించారు. పోలీసుల నుంచి సమాచారం రాకుంటే ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి నేరుగా వెళ్లి.. కేసీఆర్‌ను సందర్శించి యోగక్షేమాలు తెలుసుకుంటామని టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ రావు పేర్కొన్నారు.
Also Read: Canada: వెయిటర్ ఉద్యోగాల కోసం పోటెత్తిన భారతీయ విద్యార్థులు.. వీడియో వైరల్..!
ఈ విలేకర్ల సమావేశంలో పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, గజ్వేల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బయ్యారం మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు బాబ, ములుగు మండలం నరసింహారెడ్డి, నల్ల శ్రీను, శేఖర్, జగదేపూర్ మండల నాయకులు బరిగల నర్సింహులు, భువనగిరి రాజు, రతన్, స్వామి, రవి, క్యాసారం బాబా, నాయిని తిరుపతి, గిరిమల్లె రాజు, బాలయ్యగారి రాజు గౌడ్, షేర్ల భాస్కర్, ఫణి కుమార్, కరుణాకర్ రెడ్డి, భాస్కర్, మన్నె కృపానందం, జాలిగామ శ్రీనివాస్, రాజిరెడ్డిపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Dasara 2024: ఐదో రోజు.. ఈ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న దుర్గమ్మ
గతేడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది. దీంతో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ ప్ర్తతిపక్షానికి పరిమితమైంది. అయితే కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్‌కు మాత్రమే పరిమితమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు హాజరు కాలేదు. సరికదా.. ఎమ్మెల్యేగా ప్రతిపక్షనేతగా గజ్వేల్ నియోజకవర్గంలో సైతం ఆయన పర్యటించలేదు. మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జరిగిన ఏడాది కావస్తుంది. ఆయన మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు.. గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో కేసీఆర్ ఆచూకి కోసం ఫిర్యాదు చేశారు.
or More Telangana News And Telugu News...
Updated Date - Oct 06 , 2024 | 07:23 PM