ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

EX MLA Sampathkumar : నేను లేకుండా నీటి విడుదలనా? మోటార్లను ఎలా ఆన్‌ చేస్తారు?

ABN, Publish Date - Aug 07 , 2024 | 04:11 AM

: సాగునీటి విడుదల కార్యక్రమం రాజకీయ రంగును పులుముకున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ మధ్య ఆధిపత్యపోరు ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది.

  • అధికారులపై మాజీ ఎమ్మెల్యే సంపత్‌ ఆగ్రహం

  • అంతకుముందే కార్యక్రమాన్ని ప్రారంభించిన అలంపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడు

  • ఉద్రిక్తతల మధ్యతుమ్మిళ్ల ఎత్తిపోతల నీటి విడుదల

అలంపూర్‌ చౌరస్తా/రాజోలి, ఆగస్టు 6: సాగునీటి విడుదల కార్యక్రమం రాజకీయ రంగును పులుముకున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ మధ్య ఆధిపత్యపోరు ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. అలంపూర్‌ నియోజకవర్గం రాజోళి మండలం తుమ్మిళ్ల గ్రామ శివారులో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.800 కోట్ల వ్యయంతో నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నీటి విడుదల కార్యక్రమాన్ని తలపెట్టారు.

దీనికి అధికారులు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను ఆహ్వానించారు. ఎమ్మెల్యే విజయుడు తన అనుచరులు, స్థానిక రైతులతో కలిసి ఉదయం ఏడుగంటలకే తుమ్మిళ్ల ఎత్తిపోతల ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు.

స్టార్టర్లకు పూజలు చేసి మోటార్లను ఆన్‌ చేశారు. విషయం తెలుసుకున్న సంపత్‌కుమార్‌.. అనుచరులతో కలిసి హుటాహుటిన ప్రాజెక్టు వద్దకు బయలుదేరారు. ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సంపత్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను లేకుండా మోటార్లు ఎలా ఆన్‌ చేస్తారంటూ ప్రశ్నించారు. అనంతరం మోటార్లను ఆఫ్‌ చేయించి..

తన అనుచరులతో కలిసి అక్కడ పూజలు చేశారు. అదే సమయంలో సాగునీరు కిందకు రాకపోవడంతో ఎమ్మెల్యే విజయుడు తన అనుచరులతో కలిసి డెలివరీ పాయింట్‌ వద్ద టెంటు వేసుకొని బైఠాయించారు.

విషయం తెలుసుకున్న సంపత్‌కుమార్‌ ఎమ్మెల్యే విజయుడు అక్కడి నుంచి వెళ్లేదాక మోటార్లను ఆన్‌ చేయవద్దంటూ అధికారులను ఆదేశించారు. ఉద్రిక్తతలు ఏర్పడటంతో పోలీసులు భారీగా మోహరించారు.

ఎమ్మెల్యే విజయుడితో పాటు ఆయన అనుచరులను అరెస్ట్‌ చేశారు. అనంతరం సంపత్‌ ఆదేశాలతో అధికారులు నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత సంపత్‌ను కూడా అరెస్టు చేశారు.

Updated Date - Aug 07 , 2024 | 04:11 AM

Advertising
Advertising
<