ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: అధిక వడ్డీ ఆశపెట్టి.. 200 కోట్లు కొల్లగొట్టి

ABN, Publish Date - May 21 , 2024 | 04:35 AM

ఆమె, అబిడ్స్‌లోని స్టేట్‌-కో-ఆపరేటివ్‌ సొసైటీలో జనరల్‌ మేనేజర్‌! బ్యాంకులో సహోద్యోగులు, సిబ్బంది, ఖాతాదారులతో కలుపుగోలుగా ఉండేది. ఇదే వారిని నిండా ముంచేసింది. ‘బ్యాంకులో డబ్బులు వేస్తే వడ్డీ పెద్దగా రాదు. మాకు ఫైనాన్స్‌ బిజినెస్‌ ఉంది. నా భర్త, కుమారుడు మాత్రమే చూస్తారు.

  • తెలంగాణ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ మహిళా జీఎం మోసం

  • శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌

  • పేరుతో డిపాజిట్ల సేకరణ

  • 5 నెలల నుంచి చెల్లింపుల బంద్‌

  • ఒత్తిడి పెరగడంతో దీర్ఘకాల సెలవు

  • 3 నెలల ముందే పదవీ విరమణ

  • ప్రశ్నిస్తే రేపు, మాపు అని దాటవేత

  • ఇల్లు, ఆఫీసుకు తాళం వేసి పరార్‌

  • సీసీఎస్‌ ముందు బాధితుల ధర్నా

హిమాయత్‌నగర్‌/హైదరాబాద్‌ సిటీ, మే 20 (ఆంధ్రజ్యోతి): ఆమె, అబిడ్స్‌లోని స్టేట్‌-కో-ఆపరేటివ్‌ సొసైటీలో జనరల్‌ మేనేజర్‌! బ్యాంకులో సహోద్యోగులు, సిబ్బంది, ఖాతాదారులతో కలుపుగోలుగా ఉండేది. ఇదే వారిని నిండా ముంచేసింది. ‘బ్యాంకులో డబ్బులు వేస్తే వడ్డీ పెద్దగా రాదు. మాకు ఫైనాన్స్‌ బిజినెస్‌ ఉంది. నా భర్త, కుమారుడు మాత్రమే చూస్తారు. బడా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు, వ్యాపారులకు ఫైనాన్స్‌ చేస్తుంటాం. సో.. మా సంస్థలో పెట్టుబడులు పెడితే 10-18 శాతం దాకా వడ్డీ ఇస్తాం’ అని ఆశపెట్టి రూ.200 కోట్ల దాకా సేకరించింది. కొన్నాళ్లు వడ్డీ టంచనుగానే ఇస్తూ వచ్చినా, గత ఐదు నెలల నుంచి ఇవ్వడం లేదు. డిపాజిటర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో రాత్రికి రాత్రే భర్త, కుమారుడితో కలిసి బిచాణా ఎత్తేసింది. నిందితురాలైన ఆ అధికారిణి పేరు నిమ్మగడ్డ వాణిబాల! మోసపోయామని తెలుసుకున్న బాధితులు నెత్తీనోరు కొట్టుకుంటూ సీసీఎస్‌ ఎదుట ఆందోళన చేశారు. వాణిబాల నుంచి డబ్బులు ఇప్పించాలని కోరారు.


బాధితుల్లో వాణిబాల సహచరులు, సహోద్యోగులు, కిందిస్థాయి సిబ్బంది కూడా ఉండటం గమనార్హం. బాధితుల వివరాల ప్రకారం..నిమ్మగడ్డ వాణిబాల అబిడ్స్‌లోనే శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో ఫైనాన్స్‌ సంస్థ ఉంది. వ్యాపార వ్యవహారాలన్నీ ఆమె భర్త మేక నేతాజీ, కుమారుడు శ్రీహర్ష చూసుకుంటున్నారు. వాణిబాల తనకు తెలిసిన వారి నుంచి, సహచర ఉద్యోగుల నుంచి పెద్దమొత్తంలో తన ఫైనాన్స్‌ సంస్థలో డిపాజిట్లు చేయించింది. వారికి ఎప్పటికప్పుడు రిటర్న్స్‌ ఇస్తుండటంతో కిందిస్థాయి ఉద్యోగులు కూడా పెద్దమొత్తంలో డబ్బులు డిపాజిట్‌ చేశారు. గత ఐదు నెలలుగా రిటర్న్స్‌ రాకపోవడం, డిపాజిట్లూ వెనక్కి ఇవ్వకపోవడంతో డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో కొద్దిరోజుల క్రితం ఆమె ఆఫీసుకు లాంగ్‌లీవ్‌ పెట్టేసింది. పైగా రిటైర్మ్‌ంట్‌కు రెండు-మూడు నెలల ముందే ఆమె ఉద్యోగం మానేయడంతో బాధితుల్లో ఆందోళన మొదలైంది. డిపాజిటర్లలో కొందరు సైదాబాద్‌లో ఉన్న ఆమె ఇంటికి వచ్చి నిలదీస్తుండటంతో రేపు మాపు అంటూ దాటవేస్తూ వచ్చింది. డిపాజిటర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో రాత్రికి రాత్రే సైదాబాద్‌లోని ఇంటికి, అబిడ్స్‌లోని కార్యాలయానికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి పరారైనట్లు తెలిసింది. కేసు నమోదు చేసిన సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - May 21 , 2024 | 04:35 AM

Advertising
Advertising