ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS Politics: తెలంగాణ భవన్‌కు చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్.. ఆ సీటుపై క్లారిటీ!

ABN, Publish Date - Mar 03 , 2024 | 03:46 PM

మాజీ సీఎం, బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) పార్టీ కేంద్ర కార్యాలయం ‘తెలంగాణ భవన్‌’కు చేరుకున్నారు. కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని పార్టీ నేతలతో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ నెల 10న కరీంనగర్‌లో నిర్వహించనున్న సభపై నేతలతో చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణతో పాటు ఈ నెల 10 కరీంనగర్‌లో నిర్వహించతలపెట్టిన సభపై చర్చించనున్నారని తెలుస్తోంది.

హైదరాబాద్: మాజీ సీఎం, బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) పార్టీ కేంద్ర కార్యాలయం ‘తెలంగాణ భవన్‌’కు చేరుకున్నారు. కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని పార్టీ నేతలతో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ నెల 10న కరీంనగర్‌లో నిర్వహించనున్న సభపై నేతలతో చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణతో పాటు ఈ నెల 10 కరీంనగర్‌లో నిర్వహించతలపెట్టిన సభపై చర్చించనున్నారని తెలుస్తోంది. ఇటీవలే మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 10న కరీంనగర్‌లోని మెడికల్ కాలేజీ గ్రౌండ్‌లో భారీ సభకు ప్లాన్ చేసింది. ఈ సభను సక్సెస్ చేయడానికి జనసమీకరణ ఏవిధంగా చేయాలి, ఏ నియోజకవర్గం నుంచి ఎంతమందిని తరలించాలి అనే అంశాలతో పాటు సభపై సమగ్రంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం.

ఇక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, కేంద్రంలో అధికార బీజేపీ పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరదీసి బీఆర్ఎస్ నేతలను తమ పార్టీల్లోకి లాక్కుంటున్నాయి. ఏకంగా సిట్టింగ్ ఎంపీలనే పార్టీలు లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కేడర్‌ను ఏవిధంగా కాపాడుకోవాలి, ఏవిధమైన భరోసాను నేతలకు కల్పించాలనే అంశాలపై కూడా కేసీఆర్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో.. ఇప్పటివరకు పోటీ చేస్తారని భావించిన నేతలు ఒకవేళ ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతే ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే అంశాలపై కూడా కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాలకు చెందిన నేతలతో కేసీఆర్ చర్చించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కూడా కేసీఆర్ సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

కరీంనగర్ స్థానం బోయినపల్లి వినోద్ కుమార్‌కు ఇప్పటికే టికెట్‌పై క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన నియోజకవర్గంలో ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ఇక పెద్దపల్లి స్థానంలో సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్‌కు మరోసారి టికెట్ ఇవ్వాలని భావించినప్పటికీ ఆయన పార్టీ మారడంతో.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నేటి సమావేశంలో దానిపై కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.

Updated Date - Mar 03 , 2024 | 03:47 PM

Advertising
Advertising