ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Harish Rao : రేవంత్‌ది అబద్ధాల ప్రచారం

ABN, Publish Date - Nov 13 , 2024 | 04:49 AM

మహారాష్ట్ర ఎన్నికల సభలకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అబద్ధపు ప్రచారాలు చేశారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.

  • రోడ్లపై ధాన్యం కుప్పలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం: జగిత్యాల రోడ్‌ షోలో హరీశ్‌రావు

జగిత్యాల/వేములవాడ/హైదరాబాద్‌, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర ఎన్నికల సభలకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అబద్ధపు ప్రచారాలు చేశారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. కోరుట్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ పాదయాత్రలో కొద్దిదూరం పాల్గొన్న హరీశ్‌రావు.. జగిత్యాలలో రోడ్‌ షోలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పండించిన పంటను కొనాలని అడుగుతున్న రైతుల వడ్ల లోడును కాదు.. మహారాష్ట్రకు డబ్బుల మూటల లోడును రేవంత్‌ ఎత్తుతున్నాడని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై ఉన్న ధాన్యం కుప్పలు రేవంత్‌ పాలనా వైఫల్యానికి నిదర్శనమన్నారు. అంతకుముందు హరీశ్‌ వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. రేవంత్‌కు జ్ఞానోదయం కలిగించాలని కోరుకున్నానని చెప్పారు. రుణమాఫీ హామీ నేరవేర్చనందుకు రేవంత్‌.. వేములవాడ రాజన్న దగ్గరకు వచ్చి తప్పయ్యిందని వేడుకోవాలన్నారు. కేసీఆర్‌ గురించి మాట్లాడే నైతిక అర్హత రేవంత్‌కు లేదని, అన్నింటిలో నంబర్‌ వన్‌గా ఉన్న తెలంగాణ 11 నెలల్లో అన్నింటినీ కోల్పోయిందన్నారు. కాగా, అర్ధరాత్రి 300 మంది పోలీసులు లగచర్ల గ్రామస్థులను అరెస్టు చేయడం దారుణమని, వారిని వెంటనే విడుదల చేయాలని హరీశ్‌రావు ‘ఎక్స్‌’లో డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 13 , 2024 | 04:51 AM