ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Konda Surekha: మంత్రి కొండా సురేఖ ట్రోలింగ్ వ్యవహారంపై స్పందించిన హరీశ్ రావు

ABN, Publish Date - Sep 30 , 2024 | 09:33 PM

సోషల్ మీడియా వేదికగా మంత్రి కొండా సురేఖపై జరుగుతున్న అసభ్యకరమైన ట్రోలింగ్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీశ్ రావు స్పందించారు. మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా మంత్రి కొండా సురేఖపై జరుగుతున్న అసభ్యకరమైన ట్రోలింగ్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీశ్ రావు స్పందించారు. మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించరని అన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయినా, వ్యక్తిగతంగా నేనైనా ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. ‘‘ కొండా సురేఖ గారు మీకు కలిగిన అసౌకర్యానికి మీతో పాటు నేనూ చింతిస్తున్నాను. సోషల్ మీడియా వేదికగా జరిగే ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నాను. సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని అందరిని కోరుతున్నాను’’ అని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు.


మంత్రి కొండా సురేఖ కంటతడి

కాగా తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై మంత్రి కొండా సురేఖ ఇవాళ స్పందించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. పలుమార్లు కంటతడి పెట్టారు. కేటీఆర్ ఖబడ్దార్ .. ఖబడ్దార్ కేసీఆర్ అని ఆమె హెచ్చరించారు. ఈ ట్రోలింగ్ వీడియోలను మీ చెల్లికి, తల్లికి చూపించు కేటీఆర్ అని అన్నారు. ఇకపై ట్రోలింగ్ చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అన్ని పార్టీల వాళ్లు తనను అక్కా అని, తన భర్తను బావ అని పిలుస్తారని ఆమె చెప్పారు. ఇంకోసారి ఇలా చేస్తే కేటీఆర్ బట్టలు ఊడదీసి పరిగెత్తిస్తామని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంపీ రఘునందన్ కాల్ చేసి క్షమించమని అడిగాడని, అక్కా క్షమించు కాళ్లు మొక్కుతా అని రఘునందన్ అన్నాడని ప్రస్తావించారు. సిగ్గు లజ్జ ఉంటే బట్టలు లేకుండా తిరుగాలంటూ రఘునందన్‌ను విమర్శించారు.


‘‘ఏదో ఒకరోజు ప్రజలు తిరగబడతారు. చేనేత కార్మికుల ఓట్లతో గెలిచి పద్మశాలి బిడ్డను ఇంత అవమనపరుస్తారా?. మానసిక వేదన కలిగించి కుటుంబాల్లో ఇబ్బంది పెడుతారా?. నాకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే కేసీఆర్ మహిళకు మంత్రిపదవి ఇవ్వలేదు. రెండవరసారి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్‌లో భారీ మార్పులు వచ్చాయి. బీఆర్ఎస్ నాయకులు డబ్బు మదం ఎక్కి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు’’ అని అన్నారు.

సోషల్ మీడియాలో ఒక మంత్రిని ఈ విధంగా ట్రోలింగ్ చేయడం సరికాదంటూ కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఈ వ్యవహారంపై మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు.

Updated Date - Sep 30 , 2024 | 09:44 PM