ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sarpanch: కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్‌ ఆత్మహత్య

ABN, Publish Date - Nov 23 , 2024 | 04:58 AM

సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన మాజీ సర్పంచ్‌ పాంకుంట్ల సాయిరెడ్డి (80) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

  • సీఎం రేవంత్‌రెడ్డి సోదరులు కక్ష కట్టారని సూసైడ్‌ నోట్‌

  • తన ఇంటికి అడ్డంగా పశువుల దవాఖానా నిర్మించారు..

  • ఇంటికి దారి వదలాలని కోరితే పార్టీల నింద మోపారు..

  • ఇంటికి అడ్డంగా గోడ నిర్మిస్తున్నారు.. లేఖలో ఆరోపణలు

  • మనస్తాపంతో పురుగుల మందుతాగి బలవన్మరణం

కల్వకుర్తి నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన మాజీ సర్పంచ్‌ పాంకుంట్ల సాయిరెడ్డి (80) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తనపై సీఎం రేవంత్‌ రెడ్డి సోదరులు కక్షగట్టారని, పార్టీల నింద మోపుతూ తన ఇంటి దారికి అడ్డంగా గోడ నిర్మించడానికి పూనుకొన్నారని సూసైడ్‌ నోట్‌ రాశారు. ఈ ఘటన శుక్రవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో జరిగింది. స్థానికులు, సూసైడ్‌ నోట్‌లోని వివరాల ప్రకారం.. కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి ఇంటి ముందు ఇటీవల పశువైద్యశాల నూతన భవనాన్ని నిర్మించి ప్రారంభించారు. శుక్రవారం ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టేందుకు అధికారులు అక్కడికి వచ్చారు.


ప్రహరీ రూపంలో తన ఇంటి దారికి అడ్డంగా గోడ నిర్మిస్తారనే ఆందోళనతో సాయిరెడ్డి అక్కడే రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. ఇది గొడవకు దారితీసింది. అధికారులిచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దారి కోసం ఆరు ఫీట్ల స్థలం వదులుతారని సాయిరెడ్డికి నర్దిచెప్పి వెళ్లిపోయారు. అనంతరం సాయిరెడ్డి కల్వకుర్తికి వచ్చారు. పంజుగుల రోడ్డులో పురుగుల మందుతాగి కింద పడిపోయారు. గుర్తించిన స్థానికులు ఆయన్ను కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అందించేలోపే సాయిరెడ్డి మృతి చెందారు. మనస్తాపానికి గురైన సాయిరెడ్డి 40 ఏళ్లుగా తమ ఇంటికి ఉన్న దారిని సీఎం సోదరులు తన మీద కక్ష కట్టి ఇంటి ముంగిట పశువుల దావాఖాన నిర్మించారని మరణవాంగ్మూలంలో పేర్కొన్నారు. తన ఇంటికి దారి ఉండద నే బాధతో చనిపోతున్నానని పేర్కొన్నారు. కాగా సాయిరెడ్డి ఆత్మహ్య ఘటనపై కుమారుడు మాధవరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సూసైడ్‌ నోట్‌ను నిపుణుల విశ్లేషణకు పంపి విచారణ చేపడతామని సీఐ నాగార్జున చెప్పారు. మరోవైపు.. సాయిరెడ్డి ఆత్మహత్యకు సీఎం రేవంత్‌ బాధ్యత వహించాలని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వలబాల రాజు డిమాండ్‌చేశారు. సీఎం సోదరులు అవమానించడం వల్లే సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు.


  • సాయిరెడ్డి సూసైడ్‌ నోట్‌ యథాతథంగా..

’’నేను, పాంకుంట్ల సాయిరెడ్డి. గ్రామంలో 40 ఏళ్ల క్రితం సొంతంగా ఇల్లు కట్టుకున్నా. దారి కోసం ఇంటి ముందు ఉన ్న ఒక పాడుబడ్డ బావిబొందను సొంత ఖర్చులతో పూడ్చుకొన్నాను. నా ఇంటికి పాలబూత్‌ పక్క నుంచి దారి చేసుకొన్నాను. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి బ్రదర్స్‌ నా మీద కక్షకట్టి నా ఇంటి ముందు పశువుల దవాఖానా కట్టారు. నేను ఎలాంటి ఆక్షేపణ చేయలేదు. దవాఖానా పక్క నుంచి నా ఇంటికి దారి వదలాలని కోరాను. నా ఇంటికి దారి ఇడుస్తామని చెప్పారు. కానీ, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి బ్రదర్స్‌ నా మీద పార్టీల నింద మోపి నా ఇంటి దారికి అడ్డంగా గోడ నిర్మించటానికి పూనుకొన్నారు. నేను ఏ పార్టీ వ్యక్తిని కాదు. నాది ప్రస్తుతం దేవుని పార్టీ. కానీ, ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. నా ఇంటికి దారి ఉండదని అనుకోలేదు. అందుకే బాధతో చనిపోవుతున్నాను. ’’

Updated Date - Nov 23 , 2024 | 04:59 AM