TS News: పార్ట్ టైం జాబ్ పేరిట ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్ల మోసం..
ABN, Publish Date - Jun 07 , 2024 | 10:30 AM
పార్ట్ టైం జాబ్ పేరిట ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.9.79 లక్షలకు టోకరా వేయడం జరిగింది. పట్టణానికి చెందిన శ్రీకాంత్‌కు పార్ట్ టైం జాబ్ చేస్తారా అంటూ గత నెల 29న ఫోన్‌కు సైబర్ నేరగాళ్లు ఓ మెసేజ్ పంపారు. మొదట రూ.9 వేలు, ఆపై రూ.12 వేలు కట్టించుకుని టాస్క్‌లు ఇస్తూ శ్రీకాంత్ ముందుగా కట్టే మొత్తాన్ని పెంచుతూ వెళ్లారు.
కామారెడ్డి: పార్ట్ టైం జాబ్ పేరిట ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.9.79 లక్షలకు టోకరా వేయడం జరిగింది. పట్టణానికి చెందిన శ్రీకాంత్‌కు పార్ట్ టైం జాబ్ చేస్తారా అంటూ గత నెల 29న ఫోన్‌కు సైబర్ నేరగాళ్లు ఓ మెసేజ్ పంపారు. మొదట రూ.9 వేలు, ఆపై రూ.12 వేలు కట్టించుకుని టాస్క్‌లు ఇస్తూ శ్రీకాంత్ ముందుగా కట్టే మొత్తాన్ని పెంచుతూ వెళ్లారు. డబ్బులు వస్తాయని ఆశపడి ఈ క్రమంలో మొత్తం రూ.9.79 లక్షలు సదరు మర్చంట్ అకౌంట్‌కు శ్రీకాంత్ జమ చేశాడు. మరో రూ.8 లక్షలు జమ చేస్తే మొత్తం రూ.23.64 లక్షలు వస్తాయని సైబర్ నేరగాళ్లు అనడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ హెచ్‌వో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Updated Date - Jun 07 , 2024 | 10:30 AM