ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులకు పూర్థి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి

ABN, Publish Date - Dec 21 , 2024 | 12:50 AM

మండలంలోని పెద్దాపూర్‌ గురుకుల బాలుర కళాశాల, పాఠశాలలోని విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రా కుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని కింది స్థాయి అధికారులను కలె క్టర్‌ సత్యప్రసాద్‌ ఆదేశించారు. శుక్రవారం గురుకులంలో చేస్తున్న పనులను మె ట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు.

విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

మెట్‌పల్లి రూరల్‌, డిసెంబర్‌, 20 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పెద్దాపూర్‌ గురుకుల బాలుర కళాశాల, పాఠశాలలోని విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రా కుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని కింది స్థాయి అధికారులను కలె క్టర్‌ సత్యప్రసాద్‌ ఆదేశించారు. శుక్రవారం గురుకులంలో చేస్తున్న పనులను మె ట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. గురుకుల పరిసరాలలో చే స్తున్న పనులను తనిఖీ చేశారు. గురుకుల ప్రహరీ చుట్టూ పరిశీలించి, గోడకు ఎ లాంటి రంధ్రాలు లేకుండా పూడ్చాలని, గుంతలు లేకుండా చూడాలని, పిచ్చి మొ క్కలు తొలగించి పరిసరాలను శుభ్రం చేసి శానిటేషన్‌ పనులు చేపట్టాలన్నారు. ఆవరణంలో పెద్దగా ఉన్న చెట్లపైకి అధిక సంఖ్యలో కోతులు వచ్చి విద్యార్థులకు ఇ బ్బందులు లేకుండా అనవసరమైన చెట్లను తొలగించాలన్నారు. మున్సిపాలిటి సి బ్బందితో గురుకుల ఆవరణంలో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్య లు తీసుకోవాలని సూచించారు. పనులలో ఆలసత్వం వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంకా అవసరమైన అభివృద్ధి పనుల గురించి ని వేదిక ఇవ్వాలని నిర్వహకులకు సూచించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ రోగ్య వివరాలను మెడికల్‌ అధికారి అంజిత్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకులంలో ఉండే విద్యార్థులకు ఎలాంటి ఇ బ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా గదు లు, స్నానపు గదులు, కిటికీలు ఏర్పాటు, దోమలు, విష కిటకాలు గదులోనికి రాకుండా, వాటి వల్ల విద్యార్థులకు ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులు గురుకు లంలో ఏం జరుగుతుందో తెలియడం లేదని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలి య ని పరిస్థితి నెలకొందని కలెక్టర్‌కు సమస్యలను వివరించారు. గురుకులంలోని సమ స్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి తల్లిదండ్రులతో కమిటీ ఏర్పాటు చేసి తప్పకుండా విద్యార్థులకు అన్ని విధాలుగా రక్షణ కల్పించడమే తమ ధ్యేయమని తల్లిదండ్రులకు కలెక్టర్‌ భరోసా కల్పించారు. విద్యార్థుల చదువు పాడుకాకుండా తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని, అస్వస్థతకు గురైన విద్యార్థుల ఓంకారి అఖిల్‌, బోడ యశ్వంత్‌ ఆరోగ్యం కుదుటపడిందన్నారు. కలెక్టర్‌ వెంట డీపీవో రఘువరణ్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఇన్‌చార్జి ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో మహే శ్వర్‌రెడ్డి, ఆర్‌ఐ ఉమేష్‌, పంచాయతీ కార్యాదర్శులు, ఆసీఫ్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Dec 21 , 2024 | 12:50 AM