ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhadrachalam: ఉగ్రరూపం దాల్చిన గోదావరి

ABN, Publish Date - Jul 22 , 2024 | 07:01 AM

భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గోదావరి నీటిమట్టం 46.40 అడుగులకు చేరుకుంది. వరద ప్రవాహం 10,68,602 క్యూసెక్కులకు చేరుకుంది. ఈ క్రమంలోనే గోదావరి ఉగ్రరూపం దాల్చింది.

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గోదావరి నీటిమట్టం 46.40 అడుగులకు చేరుకుంది. వరద ప్రవాహం 10,68,602 క్యూసెక్కులకు చేరుకుంది. ఈ క్రమంలోనే గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రెండవ ప్రమాద హెచ్చరిక దిశగా కొనసాగుతోంది. 48 అడుగులు దాటితే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టుకు చెందిన 25 గేట్లు ఎత్తి 62932 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.


తాలిపేరు ఇన్ ఫ్లో 59420 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు ఇల్లందు డివిజన్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇల్లందు డివిజన్‌లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గుండాల, ఆళ్ళపల్లి మండలాల్లో కిన్నెరసాని, జల్లేరు, మల్లన్న, ఏడు మెలికల వాగులు ఉధృతంగా ప్రహిస్తున్నాయి. సుమారు 13 గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి.


ఇక మహబూబ్ నగర్ జిల్లాలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. ప్రియదర్శిని జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీ కాగా.. ప్రస్తుత నీటిమట్టం 317.210 మీటర్లకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంలకు చేరుకోగా.. ప్రస్తుత నీటి నిల్వ 7.115 టీఎంసీలకు చేరుకుంది. ప్రియదర్శిని జూరాల ఇన్ ఫ్లో 1,42,000 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 1,33,497 క్యూసెక్కులుగా ఉంది. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు సంబంధించిన 27 గేట్లను అధికారులు ఎత్తివేశారు.

Hyderabad : వైద్య శాఖ బదిలీల్లోనే ఎందుకిలా?

Read more TS News and Telugu News

Updated Date - Jul 22 , 2024 | 07:01 AM

Advertising
Advertising
<