ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Laddu Action: బాలాపూర్‌ను మించిన బండ్లగూడ

ABN, Publish Date - Sep 17 , 2024 | 05:28 PM

వినాయకుడి వద్ద ఉంచిన లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడతారు. రూ.లక్షల్లో వేలం పాట పడి సొంతం చేసుకుంటారు. ఆ లడ్డూ మహా ప్రసాదంతో మంచి జరుగుతుందని విశ్వసిస్తారు.

Ganesh Laddu Action,

వినాయక ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం లడ్డూల వేలం. నిమజ్జనం చేసే రోజు ఉదయం లడ్డూలను వేలం వేస్తారు. లడ్డూ దక్కించుకుంటే మంచి జరుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు. అందుకోసం ఎంతైనా వేలం వేసేందుకు వెనకాడారు. గణేశ్ లడ్డూ వేలం పాట అంటే ముందుగా గుర్తొచ్చేది బాలాపూర్ లడ్డూ. బాలాపూర్ లడ్డూ కన్నా ఇతర చోట్ల లడ్డూలు మంచి ధర పలికాయి.


రూ.కోటి పలికిన లడ్డూ

బండ్లగూడలో ఓ లడ్డూ రూ.కోటి పైగా పలికింది. బండ్లగూడ జాగీర్‌లో కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో వేలం జరిగింది. విల్లాలో ఉన్న కమ్యూనిటీ లడ్డూను దక్కించుకుంది. అందరూ కలిసి రూ.1.87 కోట్లకు వేలం వేశారు. గతంలో రూ.1.26 కోట్లకు లడ్డూను సొంతం చేసుకున్నారు. వచ్చిన డబ్బులను పేదల కోసం ఉపయోగిస్తామని ప్రకటించారు.


రూ.30 లక్షలు

బాలాపూర్ లడ్డూ రూ.30 లక్షల వెయ్యి రూపాయలు పలకింది. కొలను కుటుంబం లడ్డూను దక్కించుకుంది. కొలను శంకర్ రెడ్డి వేలం వేసి, ఆ వెంటనే కమిటీకి నగదును అందజేశారు. గత ఏడాది లడ్డూను రూ.27 లక్షలకు దాసరి దయానంద్ రెడ్డి దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డూ వేలం 1994లో రూ.450తో ప్రారంభమై.. ఇప్పుడు రూ.30 లక్షలకు చేరుకుంది.


-మాదాపూర్‌లో మై హోమ్ భుజాలో గణేశ్ లడ్డూ రికార్డు ధర పలికింది. ఖమ్మం జిల్లా కొండపల్లికి చెందిన గణేశ్ రూ.29 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. గత ఏడాది ఇక్కడ లడ్డూ రూ.25.50 లక్షలు పలికింది.


- విజయవాడ రూరల్ నున్న పంచాయతీ పరిధిలో లడ్డూ భారీ వేలం పలికింది. శ్రీసాయి బాలాజీ ఎన్ క్లేవ్ అపార్ట్ మెంట్‌‌లో లడ్డూ రూ.26 లక్షలు పలికింది. ప్రైవేట్ కంపెనీ మేనెజింగ్ డైరెక్టర్లు సింగంరెడ్డి ప్రదీప్ రెడ్డి, నక్కా రామ్ లడ్డూను రూ.26 లక్షలకు సొంతం చేసుకున్నారు.


-ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరులో లడ్డూ భారీ ధర పలికింది. దివ్య గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాట వేసింది. దెందుకూరుకు చెందిన టీ ఉపేంద్ర రూ.2.90 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Sep 17 , 2024 | 05:28 PM

Advertising
Advertising