ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: హైదరాబాద్‌లో గ్యాంగ్‌స్టర్ హత్య.. కారుతో వెంబడించి మరీ..

ABN, Publish Date - Aug 09 , 2024 | 09:08 AM

హైదరాబాద్‌లో గ్యాంగ్‌స్టర్ హత్య సంచలనం రేపుతోంది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్‌సీఐ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది.

హైదరాబాద్: హైదరాబాద్‌లో గ్యాంగ్‌స్టర్ హత్య సంచలనం రేపుతోంది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్‌సీఐ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. పాతబస్తీ బాలాపూర్‌లో గ్యాంగ్‌స్టర్ రియాజ్ (39) పై కాల్పులు జరిగాయి. బైక్‌పై వెళుతున్న రియాజ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కారుతో వెంబడించి మరీ వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టి ఆపై కాల్పులు జరిపారు. దీంతో రియాజ్ అక్కడికక్కడే మరణించాడు. పాత కక్షల నేపథ్యంలోనే రియాజ్‌పై దాడి చేసి చంపి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏఆర్‌సీఐ రోడ్డులో రియాజ్‌పై గుర్తు తెలియని దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా పోలీసులు గుర్తించారు.


ఘటనా అనంతరం నిందితులు అక్కడి నుంచి పరార్ అయ్యారు. ఘటనా స్థలం నుంచి బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాబా నగర్ సి బ్లాక్‌లో రియాజ్ నివాసం ఉంటున్నాడు. గతంలో పలు హత్య కేసులతో పాటు పలు నేరాల్లో రియాజ్ ప్రమేయం ఉందని పోలీసులు చెబుతున్నారు. రౌడి షీటర్ చాకు నజీర్‌కు.. రియాజ్ మధ్య గొడవలు ఉన్నట్టు సమాచారం. ఫజల్ అనే రౌడీ షీటర్ హత్య కేసులో మృతుడు రియాజ్ నిందితుడిగా ఉన్నాడు. కారంతో కలిపిన నీళ్లు రియాజ్ కళ్ళలోకి కొట్టి అతనిపై పిస్టల్‌తో కాల్పులు జరిపారు. పోలీసులు ఈ కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. రాచకొండ ఎస్ఓటి, హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు.


రియాజ్ హత్య కేసులో సంచలన విషయాలు..

ఆరు హత్య కేసుల్లో రియాజ్‌కు ప్రమేయం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. రియాజ్‌పై 2004 లోనే కాంచనబాగ్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఓపెన్ చేయడం జరిగింది. 2013 లో గ్యాంగ్ స్టర్ అయుబ్ ఖాన్ బామ్మర్ది ఫజల్ అనే రౌడీ షీటర్‌ను హతమార్చిన కేసులోనూ రియాజ్ ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి రౌడీషీటర్ ఛాకు నజీర్‌తో కలిసి బాలాపూర్ సప్తగిరి బార్‌లో మద్యం సేవించాడు. అనంతరం ఆర్సీఐ రోడ్డు వద్దకు రాగానే రియాజ్‌పై ప్రత్యర్ధులు కాల్పులు జరిపారు. రియాజ్‌పై మూడు రౌండ్లు కాల్పులు జరిపి, తలపై రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానితులు ఉన్నారు.

Updated Date - Aug 09 , 2024 | 09:08 AM

Advertising
Advertising
<