యథేచ్ఛగా లింగ నిర్ధారణ..
ABN, Publish Date - Oct 09 , 2024 | 01:10 AM
కాసులకు కక్కుర్తి పడి జిల్లా లోని కొందరు వైద్యులు యథేచ్ఛగా లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. గర్భంలో ఉన్నది ఆడ, మగ అని నిర్ధారిస్తూ...ఆడ శిశువు అయితే పురిట్లోనే కడతేరుస్తున్నారు. తాజాగా జిల్లాలోని అశోక్ నగర్‌లో గల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో..
జగిత్యాల, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): కాసులకు కక్కుర్తి పడి జిల్లా లోని కొందరు వైద్యులు యథేచ్ఛగా లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. గర్భంలో ఉన్నది ఆడ, మగ అని నిర్ధారిస్తూ...ఆడ శిశువు అయితే పురిట్లోనే కడతేరుస్తున్నారు. తాజాగా జిల్లాలోని అశోక్ నగర్‌లో గల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇటీవల వైద్య శాఖ ఆధ్వర్యంలో మెటర్నరీ హెల్త్ అండ్ న్యూ ట్రిషియన్ బృందం తనిఖీ చేసి అనుమతి లేకుండా ఉన్న అయిదు స్కానింగ్ మిషన్లను సీజ్ చేశారు. సదరు ఆసుపత్రిలో పేషెంట్స్ వివరాలు, కేస్ షీట్ అందుబాటులో ఉంచకపోవడం, ఆసుపత్రి నిర్వహణలో నిర్ల క్ష్యం వంటి వాటిని గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఫిర్యాదు..
పోలీస్ స్టేషన్‌లో సైతం వైద్య ఆరోగ్య శాఖ ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో లింగ నిర్ధారణ వ్యవహారం వైద్య ఆరోగ్య వర్గాల్లో చర్చల్లోకి వస్తోంది. లింగ నిర్ధారణ ఫలితంగా జిల్లాలో బాలుర నిష్పత్తితో పోలిస్తే బాలికల నిష్పత్తి తక్కువగా నమోదవుతోంది. ఎప్పటికప్పుడు ఆయా సెంటర్లను తనిఖీలు నిర్వహించాల్సిన సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో బాల బాలికల జనాభా..
జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 0 నుంచి 6 ఏళ్లలోపు బాల బాలికల్లో జనాభా నిష్పత్తి తక్కువగా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 93,272 మంది బాల బాలికలు ఉన్నారు. ఇందులో 47,890 మంది బాలురు, 45,364 మంది బాలికలున్నారు. బాలుర కంటే బాలికల సంఖ్య తక్కువగా ఉంది. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తేలితే అబార్షన్లు చేయించడం వంటి కారణాల వల్ల బాలికల సంఖ్య తక్కువగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇతర ప్రాంతాల నుంచి సైతం రాక..
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి పట్టణా లతో పాటు పలు ప్రాంతాల్లో సుమారు 30 వరకు స్కానింగ్ సెంటర్లున్నా యి. కేంద్రాల వద్ద, గైనకాలజిస్టు గల ఆసుపత్రుల వద్ద లింగ నిర్ధారణ చేయడం చట్ట విరుద్ధమని బోర్డులు ప్రదర్శిస్తున్నప్పటికీ ఆచరణలో పలువురు నిర్వాహకులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అత్యంత నమ్మకంగా ఉండే వ్యక్తులు, పలువురు ఆర్‌ఎంపీలు, పీఎంపీలను నియ మించుకొని పలువురు లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్చగా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందుకు రూ. వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. దంపతుల అవసరాలను ఆసరా చేసుకొని ఒక్కో కేసుకు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు వినిపిస్తోంది. ప్రధానం గా తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టి..రెండో సారి గర్భం దాల్చిన మహిళలు లింగ నిర్ధారణకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి సైతం జిల్లా కేంద్రానికి వచ్చి అబార్షన్లు చేయించుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో గల కొన్ని ఆసుపత్రులు లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్ కోసం ప్రత్యేకంగా పేరొం దినట్లుగా ప్రచారం జరుగుతోంది. అధికారులు దృష్టి సారిస్తే అసలు వ్యవ హారం వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.
ఇష్టారీతిగా అబార్షన్లు..
జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లోని పలువురు ఆసుపత్రుల ని ర్వాహకులు ఇష్టారీతిగా అబార్షన్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కాసు లకు కక్కుర్తి పడి పలువురు ఆసుపత్రుల నిర్వాహకులు అబార్షన్లు చేస్తు న్నారు. వివాహేతర సంబంధాల వల్ల గర్బం దాల్చిన మహిళలు, ఇతర కారణాల వల్ల పలువురు గర్భిణులు అబార్షన్లకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గర్భిణులు ఆరోగ్య పరమైన కారణాల వల్ల తప్పనిసరి పరి స్థితుల్లో అబార్షన్ చేయించుకుంటే వైద్యాధికారులకు సమాచారం ఇవ్వా ల్సి ఉండగా నిబంధనలను పట్టించుకోవడం లేదు. ఆసుపత్రులు, స్కానిం గ్ కేంద్రాల్లో అప్పుడప్పుడు ఆకస్మిక తనిఖీలు చేపట్టడం, లింగ నిర్ధారణ చేస్తే కేసులు నమోదు చేయడం, అబార్షన్లు చేస్తే నిబంధనల ప్రకారం వ్యవహరించడం వంటివి వైద్యాధికారులు చేపట్టకపోవడం వల్ల అక్రమా ర్కులు ఆడింది ఆటా పాడింది పాటగా తయారయింది.
నిబంధనలు ఇలా..
కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏమైనా జన్యుపరమైన లోపాలు ఉన్నా యా..? శిశువు పెరుగుదల ఎలా ఉంది..? అనే అంశాలను తెలుసుకునేం దుకు మాత్రమే ఆలా్ట్రసౌండ్ పరీక్షలు నిర్వహించాలి. కడుపులోని బిడ్డ ఆ డో, మగో ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదు. లింగ నిర్ధారణకు సహ కరించిన వారికి 3 నెలలు జైలు, రూ. 10 వేల జరిమానా విధిస్తారు. రెం డో సారి సైతం ఇదే తప్పు చేసిన వారికి ఐదేళ్ల జైలు, రూ. 50 వేల జరి మానా విధించే అవకాశం ఉంది. ఇందులో వైద్యులు దోషులు అని తేలితే వారి లైసెన్స్‌ను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సిఫారుసు చేసి కొద్ది రోజులు రద్దు చేసే అవకాశం ఉంది. గర్భంలోని శిశువుకు లింగ నిర్దారణ చేయమని కోరిన వారికి మూడేళ్ల జైలు రూ. 50 వేల జరిమానా విధించే అవకాశం ఉంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించి నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్న లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్ట విరుద్దం
డాక్టర్ సమీయోద్దిన్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి
ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్ట విరుద్ధం. ఎవరైనా ఇటువంటి పరీక్షలు చేసినట్లు తేలితే చర్యలు తీ సుకుంటాము. ఎప్పటికప్పుడు ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాల్లో నిఘా ఉంచుతున్నాము. అక్రమార్కులను గుర్తించి జరిమానా విధించడం, చ ట్టపరంగా ముందుకు వెళ్లడం వంటివి నిర్వహిస్తాము. ఇటీవల ఓ ప్రైవే టు ఆసుపత్రిలో అయిదు స్కానింగ్ మిషన్లను సీజ్ చేసి, క్రిమినల్ చర్యల నిమిత్తం పోలీసులకు ఫిర్యాదు చేశాం.
Updated Date - Oct 09 , 2024 | 02:21 PM