ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: గ్రూప్‌-4 పోస్టులకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక

ABN, Publish Date - May 18 , 2024 | 03:13 AM

గ్రూప్‌-4 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఈ పోస్టులకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈమేరకు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎ్‌సపీఎస్సీ) వెబ్‌సైట్‌లో జాబితాను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో పోస్టుకు ముగ్గురు అభ్యర్థుల చొప్పున ఎంపిక చేశారు. వీరికి సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

  • టీఎస్‌పీఎస్సీ సైట్‌లో జాబితా

  • సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోండి

  • అధికారుల సూచన

  • నేడే టీఎస్‌ఎప్‌సెట్‌ ఫలితాలు

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-4 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఈ పోస్టులకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈమేరకు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎ్‌సపీఎస్సీ) వెబ్‌సైట్‌లో జాబితాను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో పోస్టుకు ముగ్గురు అభ్యర్థుల చొప్పున ఎంపిక చేశారు. వీరికి సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 1:3 నిష్పత్తి జాబితాలో ఉన్న అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో 8,039 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీ చేయగా.. గత ఏడాది జూలై 1న పరీక్షలు నిర్వహించారు.


ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఫలితాలు ప్రకటించారు. ఈ ఫలితాల్లో మొత్తం 7,26,837 మంది అభ్యర్థులకు సంబంధించిన మెరిట్‌ జాబితాను ప్రకటించారు. ఈ జాబితా ఆధారంగా ప్రస్తుతం ఆయా పోస్టులు, రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో పోస్టుకు ముగ్గురి చొప్పున ఎంపిక చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేశాక ఒక్కో పోస్టుకు ఒక్కో అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. కాగా వికలాంగుల కోటాలోని పోస్టులకు 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా ప్రకారం త్వరలోనే గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేయాలని కమిషన్‌ అధికారులు భావిస్తున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తైన వెంటనే పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను ప్రకటించనున్నారు.


జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదల

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. మే 26న జరగనున్న ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను ఐఐటీ మద్రాస్‌ విడుదల చేసింది. ఈ కార్డులను మే 26న మధ్యాహ్నం 2.30 గంటల వరకు అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ పరీక్షలో భాగంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఐఐటీల్లో అడ్మిషన్లను కల్పిస్తారు.

Updated Date - May 18 , 2024 | 03:13 AM

Advertising
Advertising