CM Revanth Reddy: తెలంగాణ రైతులకు త్వరలోనే శుభవార్త: సీఎం రేవంత్
ABN, Publish Date - Feb 23 , 2024 | 05:44 PM
ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.500కే గ్యాస్ సిలెండర్, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 27వ తేదీన ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమాలు ప్రారంభానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన వెల్లడించారు. ఇక రైతులకు ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీపై బ్యాంకులతో చర్చిస్తున్నామని, త్వరలోనే రైతులకు మంచి శుభవార్త చెప్పబోతున్నామని ముఖ్యమంత్రి అన్నారు.
మేడారం: సమ్మక్క-సారలమ్మ మేడారం మహాజాతరలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలకమైన ప్రకటనలు చేశారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.500కే గ్యాస్ సిలెండర్, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 27వ తేదీన ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమాలు ప్రారంభానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న చిక్కుముడులను విప్పుతూ, ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని సీఎం ప్రస్తావించారు. మేడారం మహా జాతర సందర్భంగా శ్రీ సమ్మక్క-సారలమ్మలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిలువెత్తు బంగారం (బెల్లం), పసుపు, కుంకుమ,గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
రైతు రుణమాఫీపై..
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిహామీని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. రైతులకు ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీపై బ్యాంకులతో చర్చిస్తున్నామని, త్వరలోనే రైతులకు మంచి శుభవార్త చెప్పబోతున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సుప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.పది లక్షలకు పెంచామని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతిహామీని అమలు చేస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, 6,956 మంది స్టాఫ్ నర్సుల నియామకం, 441 సింగరేణి ఉద్యోగులు, 15 వేల పోలీసు, ఫైర్ డిపార్టుమెంట్ ఉద్యోగాలు భర్తీ చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. మార్చి 2వ తేదీన మరో 6 వేలపైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామన్నారు. రెండు లక్షల ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పామో... దానికి తగినట్లు 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, వాటిని ప్రజలకు కనిపించేలా.. కుళ్లుకుంటున్న వారికి వినిపించేలా ఎల్‌బీ స్టేడియంలో నే వేలాది మంది సమక్షంలో వారికి నియామక పత్రాలు ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వలేదంటూ మాఅల్లుళ్లు,తండ్రీకొడుకలు తమ ప్రభుత్వంపై గోబెల్స్‌లా అబద్ధపు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు పది స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు.
త్వరలోనే ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌ను నియమిస్తాం
త్వరలోనే ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌ను నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చి వంద రోజులు కాలేదని, పదేళ్లు ఓపిక పట్టారని, త్వరలోనే జర్నలిస్టుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వాన్ని తేవడంతోనే జర్నలిస్టుల పని అయిపోలేదని కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టడానికి సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. వాళ్లు ఇద్దరి (బీజేపీ-బీఆర్ఎస్‌ను ఉద్దేశించి) సమన్వయం మీకు తెలుసని, ఉదయం, సాయంత్రం మాట్లాడుకుంటున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. పది సీట్లు బీజేపీకి, ఏడు సీట్లు కేసీఆర్‌కు మాట్లాడుకొని ఎన్నికలకు రాబోతున్నారని, ఆ చీకటి ఒప్పందాన్ని మీడియా మిత్రులు తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి విజ్హప్తి చేశారు.
సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తితో....
సమ్మక్క-సారలమ్మ ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మంచి వర్షాలు పడి పాడిపంటలతో ప్రజలు విలసిల్లాలని, తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని సమ్మక్క సారలమ్మను వేడుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంతో, ఈ ప్రాంత శాసనసభ్యురాలు, మంత్రి సీతక్కతో తనకున్న వ్యక్తిగత అనుబంధం.. రాజకీయంగా తామిద్దరం కలిసి చేసిన ప్రయాణం అందరికీ తెలుసని ముఖ్యమంత్రి అన్నారు. తాము ఏ ముఖ్య కార్యక్రమం తీసుకున్నాఇక్కడ సమ్మక్క-సారలమ్మ ఆశీస్సులు తీసుకొనే మొదలుపెట్టామన్నారు.
మేడారం జారత సందర్శనకు ప్రధాని మోదీ రావాలి...
దక్షణ కుంభమేళాలాంటి ఈ జాతరకు కోటిన్నర మంది భక్తులు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ పండగగా గుర్తించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మేడారం జాతరను జాతీయ పండగగా గుర్తించాలని తాము ఎన్ని సార్లు కోరినా అలా కుదరదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతం, దక్షణ భారతం అనే వివక్ష చూపడం సరికాదని ముఖ్యమంత్రి హితవు పలికారు. దక్షణ భారతమనే కాదు ప్రపంచంలోనే సమ్మక్క-సారలమ్మ జాతరకు ఒక గుర్తింపు ఉందని, వారి వీరోచిత పోరాటానికి చరిత్ర పుటల్లో స్థానం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దని, ప్రధానమంత్రి వచ్చి సందర్శించుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. గతేడాది ఫిబ్రవరి ఆరో తేదీన మేం ప్రారంభించిన యాత్ర విజయవంతమై ఈ రోజు అధికారంలోకి వచ్చి అధికారికంగా జాతరను నిర్వహించామన్నారు.
ఇవి కూడా చదవండి
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మలుపు
Kishan Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 23 , 2024 | 05:48 PM