Jishnu Dev Varma: రామయ్య సన్నిధిలో గవర్నర్ జిష్ణు వర్మ
ABN, Publish Date - Oct 26 , 2024 | 04:13 AM
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని శుక్రవారం దర్శించుకున్నారు.
భద్రాచలంలో 20 పడకల తలసీమియా వార్డు ప్రారంభం
భద్రాచలం, కొత్తగూడెం/ ఖమ్మం, అక్టోబరు25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని శుక్రవారం దర్శించుకున్నారు. శ్రీరాముని సన్నిధికి విచ్చేసిన గవర్నర్‌కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతించారు. ఆలయంలో మూలవరుల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం గవర్నర్ జిఘ్ణుదేవ్ వర్మకు అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. కాగా, రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో భద్రాచలంలో ఏర్పాటు చేసిన తలసీమియా, సికిల్‌సెల్ ఎనీమియా వార్డును ఈ పర్యటనలో భాగంగా గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రారంభించారు.
కాగా, ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పిచుకలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం పంచాయతీలను తిరిగి తెలంగాణలోని భద్రాచలంలో కలిపేందుకు చర్యలు తీసుకోవాలంటూ భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య తదితరులు గవర్నర్‌ను ఈ సందర్భంగా కోరారు.
Updated Date - Oct 26 , 2024 | 04:13 AM