ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Land Encroachment: రూ.50 కోట్ల సర్కారు స్థలానికి ఎసరు!

ABN, Publish Date - Nov 18 , 2024 | 04:34 AM

రూ.50 కోట్ల విలువ చేసే సర్కారు స్థలానికి కొందరు ఎసరు పెట్టారు. అడిగే వారు లేరన్న ధీమాతో ప్రభుత్వ భూమిలో దర్జాగా ఇళ్లు, షెడ్లు, పశువుల కొట్టాలు ఏర్పాటు చేసుకున్నారు.

  • గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీలో మరో భూ బాగోతం.. 4 ఎకరాల 23 గుంటల భూమి కబ్జా

  • ఇళ్లు, షెడ్లు, పశువుల కొట్టాల నిర్మాణం

  • ప్రభుత్వ హద్దురాళ్లున్నా బేఖాతరు

  • దోబీఘాట్‌కు కేటాయించిన ఎకరా కూడా ఆక్రమణ

మేడ్చల్‌ టౌన్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): రూ.50 కోట్ల విలువ చేసే సర్కారు స్థలానికి కొందరు ఎసరు పెట్టారు. అడిగే వారు లేరన్న ధీమాతో ప్రభుత్వ భూమిలో దర్జాగా ఇళ్లు, షెడ్లు, పశువుల కొట్టాలు ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్‌ నగరానికి ఆనుకొని ఉన్న గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయంటూ ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మరో భూ భాగోతం వెలుగు చూసింది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీ ఖాజీగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 30లో ఉన్న 4 ఎకరాల 23 గుంటల ప్రభుత్వ భూమి కబ్జాల పాలవుతోంది. కొంపల్లి మునిసిపాలిటీ పరిధిలోని దూలపల్లి గ్రామానికి చెందిన కొందరు ఈ భూమిని ఆక్రమించుకొని తొలుత తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. పశువుల కొట్టాలు, షెడ్లు వేశారు. ఈ కబ్జాలపై స్థానిక మునిసిపల్‌ అధికారులు 2022 మార్చి 21వ తేదీన రెవెన్యూ అధికారులకు వివరాలు తెలియజేస్తూ ఒక లేఖ (నెంబరు.ఏఆర్‌జీ 1/89/2022) పంపారు. కానీ, ఆ లేఖపై రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి.


దీంతో అదే ఏడాది డిసెంబరు 27వ తేదీన మునిసిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు నేరుగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్‌.. ప్రభుత్వ భూమిని సర్వే చేయించి హద్దు రాళ్లు పాతించారు. అక్కడ ఉన్న తాత్కాలిక నిర్మాణాలను తొలగించారు. ఇదే క్రమంలో గత ఏడాది అక్టోబరు 16న జిల్లా ఉన్నతాధికారులు ఒక ఎకరం స్థలాన్ని ధోబీ ఘాట్‌ నిర్మాణం కోసం రజకులకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, కబ్జాదారులు మరోసారి పడగ విప్పారు. 4 ఎకరాల 23 గుంటల ప్రభుత్వ భూమిలో ఈసారి ఏకంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. వాటితోపాటు పశువుల పాకలు, షెడ్లను నిర్మించుకున్నారు. దోబీ ఘాట్‌ కోసం కేటాయించిన ఎకరం స్థలాన్ని సైతం కబ్జా చేశారు. ఈ క బ్జాలు రెవెన్యూ అధికారుల అండదండలతో కొనసాగుతున్నాయంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇదే మునిసిపాలిటీ పరిధిలోని సర్వే నెంబరు 509లో ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన 315 చదరపు గజాల స్థలం కబ్జా విషయంలో కూడా రెవెన్యూ అధికారులు మెతక వెఖరి అవలంభించారన్న విమర్శలు వచ్చాయి.


  • విచారణ జరుపుతాం: తహసీల్దార్‌

ఖాజీగూడ సర్వే నంబర్‌ 30లోని ప్రభుత్వ స్థలం వివాదంపై విచారణ జరుపుతామని మేడ్చల్‌ తహసీల్దార్‌ శైలజ తెలిపారు. ఈ స్థలంలో ఐఎ్‌సఐ డిస్పెన్సరీ ఏర్పాటు ప్రతిపాదన ఉందన్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని, సదరు నిర్మాణాలను కూల్చివేయటమే గాక ఆయా వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Nov 18 , 2024 | 04:34 AM