ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ABN, Publish Date - Dec 29 , 2024 | 12:38 AM

వరి ధాన్యం కొనుగోళ్లు వేగవం తం చేయాలని కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ అన్నారు. ధర్మపురి మండలంలోని జైనా, మగ్గిడి గ్రామాల్లో జైనా పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధా న్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

జైనా గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ సత్యప్రసాద్‌

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

ధర్మపురి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): వరి ధాన్యం కొనుగోళ్లు వేగవం తం చేయాలని కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ అన్నారు. ధర్మపురి మండలంలోని జైనా, మగ్గిడి గ్రామాల్లో జైనా పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధా న్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో గల కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధా న్యం కుప్పలను ఆయన పరిశీలించారు. ధాన్యం ఎంత మొత్తం వస్తుందని, ధాన్యానికి సంబంధించిన తేమ శాతం ఏ విధంగా ఉందని పరిశీలించారు. అలాగే వరి ధాన్యాన్ని తీసుకుని తేమ శాతం ఏ విధంగా ఉందని తనిఖీ చేశారు. తేమ వచ్చిన సన్న రకం ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి, రైస్‌మిల్లులకు వేగవంతంగా తరలించాలని అధికారులను ఆయన ఆదే శిం చారు. వరి ధాన్యం విక్రయించే సమయంలో రైతులు ఇబ్బందులకు గురికా కుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట జగిత్యాల డీఆర్‌డీవో రఘువరన్‌, తహసీల్దార్‌ కృష్ణచైతన్య, ఎంపీడీవో రవీందర్‌, మండల వ్యవసా యాధికారి సింధూజ, జైనా పీఏసీఎస్‌ చైర్మన్‌ సౌళ్ల నరేష్‌, సీఈవో సాగర్‌ రావు, ఆర్‌ఐ శ్రీనివాస్‌యాదవ్‌, ఏఎంసీ పాలకవర్గ సభ్యులు ఎన్నం మదుక ర్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు కుంట సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 12:38 AM