ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సగం ఇళ్లకే నల్లా కనెక్షన్లు

ABN, Publish Date - Dec 21 , 2024 | 01:06 AM

నల్లగొండ పట్టణంలో 48వార్డుల్లో 42వేల గృహనిర్మాణాలు ఉన్నట్లుగా రెవెన్యూ శాఖ రి కార్డులు చెబుతున్నాయి.

మునిసిపల్‌ కార్యాలయం

సగం ఇళ్లకే నల్లా కనెక్షన్లు

రెవెన్యూ రికార్డులో 42 వేల ఇళ్లు

ఇంజనీరింగ్‌ రికార్డు లో 28,898 ఇళ్లు

శివారు ప్రాంతాల్లో లెక్క శూన్యం

భారీ మొత్తంలో ఆదాయం కొల్పోతున్న నీలగిరి మునిసిపాలిటీ

రామగిరి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): నల్లగొండ పట్టణంలో 48వార్డుల్లో 42వేల గృహనిర్మాణాలు ఉన్నట్లుగా రెవెన్యూ శాఖ రి కార్డులు చెబుతున్నాయి.కానీ ఇంజనీరింగ్‌ శాఖ రికార్డుల్లో మా త్రం, మంచినీటి కుళాయి కనెక్షన్లు 28,898 లెక్కలు చూపిస్తున్నాయి. ఇవి మునిసిపల్‌ అధికారిక లెక్కలు. వాస్తవానికి ప్రతీ ఇంటికి ఒక మంచినీటి కనెక్షన ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో ఇం టికి ఒక్కో నల్లా కనెక్షన చొప్పున 42 వేల కనెక్షన్లు ఉండి తీరాల్సిందే.కానీ అధికారికంగా 28,898 మాత్రమే ఉన్నాయి. అంటే 13, 102కనెక్షన్లు అక్రమంగా కొనసాగుతున్నట్లు అధికారిక లెక్కలు చూస్తే స్పష్టమవుతుంది. ఇకపోతే నల్లగొండ పట్టణంలో 7 విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల్లో అసి్‌సమెంట్‌ కాని గృహాల సంఖ్య సుమారు మరో 10వేలపైనే ఉంటుంది. వీటికి కూడా మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి.కానీ అధికారిక రికార్డులో మాత్రం ఈ గృహాల కు మంచినీటి కనెక్షన్లులేవు.దీనికంతటికి కారణం ఫిట్టర్ల చేతివాటమేనని పట్టణ ప్రజలు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు.

ఒక్కో కనెక్షకు రూ.5 నుంచి 10వేలు

వాస్తవానికి బీపీఎల్‌ గృహ యజమాని మంచినీటి కనెక్షన కోసం మునిసిపల్‌ కార్యాలయంలో రూ.1తో, కమర్షియల్‌ కనెక్షన కోసమైతే రూ.6వేలు డీడీ తీసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆయా ప్రాంత ఫిట్టర్లు యజమానులను కార్యాలయానికి వెళ్లకుండా కనెక్షన ఇచ్చేది తామేనని అడ్డుకుంటున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ కార్యాలయానికి వెళ్లినా తిరిగి నా వద్దకే రావాల్సి ఉంటుందని తెగేసి చెపుతుండటంతో ఆయా ఫిట్టర్‌ చెప్పిన ధరకే యజమానులు కనెక్షన్లకు ఒప్పుకోక తప్పడం లేదు. దీంతో ఒక్కో కనెక్షనకు రూ. 5 నుంచి రూ. 10వేల చొప్పున వసూళ్లు చేస్తూ కనెక్షన్లు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఫిట్టర్లను కాదని కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న యజమానులకు రకరకాల కారణాలు చెబుతూ నెలలకొద్దీ కనెక్షన్లు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నట్లు కూడా సమాచారం. దీంతో చేసేదేమి లేక గృహ యజమానులు ఫిట్టర్లు చెప్పిన ధరకే కనెక్షన్లు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా మరికొంతమంది ఫిట్టర్లు రాజకీయ ఒత్తిడిల మేరకు కూ డా కనెక్షన్లు ఇస్తున్నట్లు సమాచారం. అయితే కనెక్షన్లు ఇచ్చిన వాటికి ము నిసిపల్‌ కార్యాలయంలో రికార్డులు నమోదు చేయకుండా ప్రతీనెలా బిల్లులు ఫిట్టర్లే వసూళ్లు చేస్తు జేబులు నింపుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి కారణాల వల్లే నల్లా కనెక్షన్లు సగానికి పడిపోయినట్లుగా తెలుస్తుంది. ఇకపోతే టూటౌన ఏరియాలో ఓ ఫిట్టర్‌ రూ.30వేలు తీసుకొని మంచినీటి కనెక్షన ఇచ్చిన సంఘటనలో ఏర్పడిన పంచాయితీ రాజకీయ నాయకుల వద్దకు కూడా చేరినట్లు తెలిసింది.

మంచినీటి కనెక్షన్ల రాబడి కూడా అంతంతే...

నల్లగొండ పట్టణంలో అధికారికంగా ఉన్నా 28,898 నల్లా కనెక్షన్లుకు పన్ను రూపేనా ప్రతీ ఏడాది రూ. 3.5 కోట్లు ఆదాయం రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు రూ. 1.96కోట్లు మాత్రమే వసూళ్లు అయినట్లు తెలుస్తుంది. వసూళ్లే లక్ష్యంగా అధికారులు ఆయా మంచినీటి కనెక్షన్లు కత్తిరించి అయినా సరే పన్ను వసూళ్లు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా శివారు ప్రాంతాల్లో మిషన భగీరథ పథకం కింద ఇచ్చిన కనెక్షన్లు ఉచితమేనని కొంతమంది ప్రజలు భావిస్తునందునే మునిసిపల్‌ కార్యాలయానికి బిల్లులు చెల్లించడం లేదని సమాచారం.

వంద శాతం వసూళ్లు చేసి తీరుతాం

పేరుకుపోయిన నల్లా బిల్లులను వంద శాతం వసూళ్లు చేసి తీరుతాం. ఇకపోతే అక్రమ కనెక్షన్లు గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపుతాం. మునిసిపల్‌ ఆదాయం పెరిగేందుకు ప్రతీ అక్రమ కనెక్షనను సక్రమం చేస్తాం. చేతివాటం ప్రదర్శించే ఫిట్టర్లపై చర్యలు తీసుకుంటాం.

రాములు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌

Updated Date - Dec 21 , 2024 | 01:06 AM