Telangana Secretariat: సచివాలయంలో ఓ ఉన్నతాధికారి వేధింపులు
ABN, Publish Date - Jun 21 , 2024 | 09:50 AM
తెలంగాణ సచివాలయంలో వేధింపు ఘటనలు ఇటీవలి కాలంలో తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. కొందరు ఐఏఎస్‌లు ఆఫీస్ అటెంర్లను తమ ఇంట పనికి వినియోగించుకుంటున్న బాగోతం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మరువక ముందే తాజాగా ఓ ఉన్నతాధికారి వేధింపుల బాగోతం వెలుగు చూసింది.
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో వేధింపు ఘటనలు ఇటీవలి కాలంలో తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. కొందరు ఐఏఎస్‌లు ఆఫీస్ అటెంర్లను తమ ఇంట పనికి వినియోగించుకుంటున్న బాగోతం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మరువక ముందే తాజాగా పంచాయతీరాజ్ శాఖలోని ఓ ఉన్నతాధికారి వేధింపుల బాగోతం వెలుగు చూసింది. అడిషనల్ సెక్రెటరి హోదాలో ఉన్న అధికారి మహిళ ఉద్యోగుల పట్ల అనుచిత ప్రవర్తనకు దిగుతున్నారు. కింది స్థాయి ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఈ వ్యవహారంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఫిర్యాదు చేసేందుకు ఉద్యోగులంతా సిద్ధమవుతున్నారు. మంత్రి మహిళ కావడంతో తనను ఎవరూ ఏం చేయలేరంటూ సదరు అధికారి సవాళ్లు విసురుతున్నారు. ఎనిమిది ఏళ్ల నుంచి సదరు అధికారి అదే శాఖలో విధులు నిర్వహిస్తూ వస్తున్నారు.
Updated Date - Jun 21 , 2024 | 10:45 AM