Harish Rao: సీఎం అబద్ధాలను ఖండిస్తున్నాం
ABN, Publish Date - Nov 11 , 2024 | 04:35 AM
అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చిందంటూ మహారాష్ట్ర ప్రజలను సైతం మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
మహారాష్ట్రలో ఏ పార్టీకి ప్రచారం చేయం
హామీల అమలుపై చర్చకు సిద్ధమా?: హరీశ్
హైదరాబాద్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చిందంటూ మహారాష్ట్ర ప్రజలను సైతం మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అక్కడి ప్రజలకు సీఎం చెప్పిన అబద్ధాలను ఖండిస్తున్నామన్నారు. ఆదివారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ పార్టీకి గ్రౌండ్ ఏర్పాటు చేసుకోలేదు కాబట్టి.. అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడం లేదని పేర్కొన్నారు. అదే సమయంలో ఏ పార్టీకి కూడా అనుకూలంగా కానీ.. వ్యతిరేకంగా కానీ.. అక్కడికి వెళ్లి బీఆర్‌ఎస్ తరఫున ప్రచారం చేయబోమన్నారు. రైతుందరికీ రుణమాఫీ చేశామంటూ సీఎం రేవంత్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిడ్డారు.
కాంగ్రెస్ అధికారిక వెబ్‌సైట్ లో అబద్ధాలు పెట్టారని.. తెలంగాణలో అమలు చేయ ని పథకాలను సైతం గొప్పగా అమలు చేస్తున్నట్లు మహారాష్ట్ర పత్రికల్లో ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. హామీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సీఎంకు సవాల్ విసిరారు. మహారాష్ట్రలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే కాకుండా.. తెలంగాణ డబ్బులను అక్కడికి తరలిస్తున్నారని ఆరోపించారు. సీఎం ఎన్నికల ప్రచారంలో ఉంటూ.. మంత్రులు కొందరు ఇతర రాష్ట్రాలకు, మరికొందరు విదేశీ పర్యటనల్లో బిజీగా ఉండి పాలనను గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు.
Updated Date - Nov 11 , 2024 | 04:35 AM