ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

24 గంటల విద్యుత్‌ అంటూ మోసం: హరీశ్‌రావు

ABN, Publish Date - Nov 05 , 2024 | 04:21 AM

వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నది తామేనని చెబుతూ కాంగ్రెస్‌.. దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని, ఈ వైఖరి మంచిది కాదని.. మాజీమంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు.

హైదరాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నది తామేనని చెబుతూ కాంగ్రెస్‌.. దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని, ఈ వైఖరి మంచిది కాదని.. మాజీమంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందించే రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది కేసీఆర్‌ మాత్రమేనని సోమవారం ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఓట్ల కోసం కేసీఆర్‌ అందించిన 24 గంటల ఉచిత కరెంటు ఘనతను తమ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో సాధించిన అభివృద్ధిని చూపించలేక, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ సాధించిన అభివృద్ధిని చూపించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Updated Date - Nov 05 , 2024 | 04:21 AM