సామాజిక న్యాయ సాధనలో నల్సార్ కృషి
ABN, Publish Date - Nov 17 , 2024 | 03:54 AM
సామాజిక న్యాయంపై అవగాహన కలిగించేలా ‘నల్సార్’ విశేష కృషి చేస్తోందని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రశంసించారు.
హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ప్రశంస
శామీర్‌పేట, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): సామాజిక న్యాయంపై అవగాహన కలిగించేలా ‘నల్సార్’ విశేష కృషి చేస్తోందని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రశంసించారు. ఇక్కడ విద్యను పూర్తి చేసిన విద్యార్థులు ఆ జ్ఞానాన్ని ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించి సమాజంలో గొప్ప ప్రశంసలు పొందాలని కోరారు. శనివారం శామీర్‌పేటలోని నల్సార్ న్యాయవిశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ కృష్ణదేవరావు ఆధ్వర్యంలో దూరవిద్య కోర్సుల విద్యార్థుల కోసం ప్రత్యేక స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ హోదాలో జస్టిస్ అలోక్ అరాధే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అట్టడుగు వర్గాల ప్రజల సామాజిక న్యాయంపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యమైన దూరవిద్యను అందించడంలో నల్సార్ విశేష కృషి చేస్తోందని అభినందించారు. దూర విద్య కోర్సుల్లో దాదాపు 50 శాతం మహిళలు ఉండడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దూర విద్య లా కోర్సుల్లో 1,255 మంది విద్యార్థులు చదువులు పూర్తి చేశారు. వీరిలో 287 మందికి పట్టాలను ప్రదానం చేశారు.
Updated Date - Nov 17 , 2024 | 03:54 AM