అనర్హత పిటిషన్లు స్పీకర్‌కు అందాయా?
ABN, Publish Date - Apr 26 , 2024 | 05:54 AM
పార్టీ మారిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ సమర్పించిన దరఖాస్తులు స్పీకర్ కార్యాలయానికి అందినవీ, లేనిదీ తెలుసుకొని చెప్పాలని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డిని హైకోర్టు సూచించింది.
తెలుసుకొని చెప్పండి ఏజీకి హైకోర్టు సూచన
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): పార్టీ మారిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ సమర్పించిన దరఖాస్తులు స్పీకర్ కార్యాలయానికి అందినవీ, లేనిదీ తెలుసుకొని చెప్పాలని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డిని హైకోర్టు సూచించింది. ఈ దరఖాస్తులను స్వీకరించి, రసీదులు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదులను ఆదేశించింది.
పార్టీ ఫిరాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ను అనర్హులుగా ప్రకటించేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం గురువారం ఈ ఆదేశాలు ఇచ్చింది.
Updated Date - Apr 26 , 2024 | 05:59 AM