ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పట్టాల జారీపై ఆశలు

ABN, Publish Date - Dec 23 , 2024 | 01:58 AM

భూమి క్ర య విక్రయాలకు సంబంధించి తెల్లకాగితాలపై ఒప్పం దాలు చేసుకున్న వ్యక్తులు పట్టాలపై ఆశలు పెంచుకుం టున్నారు. కాంగ్రెస్‌ సర్కారు ధరణి స్థానంలో భూ భార తి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడంతో పాటు రెవెన్యూ చ ట్టం 2024ను ప్రతిపాదించింది.

- కొత్త రెవెన్యూ చట్టంలో సాదా బైనామాలకు చట్టబద్ధత కల్పించనున్న సర్కారు

- గత ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ

- సాదా బైనామాల పరిష్కారానికి సర్కారు నిర్ణయం

జగిత్యాల, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): భూమి క్ర య విక్రయాలకు సంబంధించి తెల్లకాగితాలపై ఒప్పం దాలు చేసుకున్న వ్యక్తులు పట్టాలపై ఆశలు పెంచుకుం టున్నారు. కాంగ్రెస్‌ సర్కారు ధరణి స్థానంలో భూ భార తి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడంతో పాటు రెవెన్యూ చ ట్టం 2024ను ప్రతిపాదించింది. ఈ చట్టంలో సాదా బై నామాలకు చట్టభద్దత కల్పించే అంశం చేర్చడంతో గ తంలో దరఖాస్తు పెట్టుకున్న వారి ఆశలు చిగురిస్తున్నాయి.

జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌ దరఖాస్తుల సంఖ్య..

జిల్లా వ్యాప్తంగా 35,010 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మెట్‌పల్లిలో 4,489 ద రఖాస్తులు, అత్యల్పంగా జగిత్యాలలో 318 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలోని గొల్లపల్లిలో 1,000 ద రఖాస్తులు, సారంగాపూర్‌ 934, ఇబ్రహీంపట్నం 1,903, బుగ్గారం 984, పెగడపల్లి 1,840, వెల్గటూరు 2,809, మ ల్లాపూర్‌ 3,025, కథలాపూర్‌ 2,757, రాయికల్‌ 3,104,కొ డిమ్యాల 837, జగిత్యాల రూరల్‌ 1,901, మేడిపల్లి 1,336, బీర్‌పూర్‌ 1,757, మల్యాల 737, ధర్మపురిలో 2,119 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

బాండ్‌ పేపర్లపైనే..

జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎక్కువగా తెల్ల కాగితా లు, బాండ్‌ పేపర్ల పైనే భూ క్రయ విక్రయాలకు చెంది న అగ్రిమెంట్లు ఉన్నాయి. సాదాబైనామా ద్వారా కొనుగో లు చేసిన వారు మోకాపై ఉండడం, అమ్మినవారి పేర్లు పట్టాదారు పాస్‌బుక్‌లలో రావడంతో సదరు భూములు తమవేనంటూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ప్రభు త్వం సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన వారికి 2016లో అవకాశం కల్పించింది. జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం వాటిని పరిష్కరించిన తర్వాతే కొత్త దరఖాస్తులు స్వీకరించను న్నట్లు రెవెన్యూ అధికారులు అంటున్నారు.

2020లో బీఆర్‌ఎస్‌ సర్కారు ప్రకటన..

2020లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాదాబైనామా లకు చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటించింది. ఎవరైనా సాధారణ పత్రాలపై క్రయ విక్రయాలు చేసుకుంటే మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సర్కారు సూ చించింది. దీంతో జిల్లాలో వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. 2019లో కొత్త రెవెన్యూ చట్టం కింద అప్పటి ప్రభుత్వం సాదాబైనామాల దరఖాస్తులను స్వీకరించినా చట్టంలో ఉన్న కొన్ని సాంకేతిక కారణాలతో పట్టాల జా రీకి ప్రతికూలత ఏర్పడింది. ఫలితంగా సాదాబైనామాల దరఖాస్తులు నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉంటున్నాయి.

కాంగ్రెస్‌ సర్కారు భూ భారతిలో ప్రతిపాదన..

ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం దరణి స్థానంలో భూభారతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడంతో పాటు రెవెన్యూ చట్టం 2024ను ప్రతిపాదించింది. ఈ చట్టంలో సాదాబై నామాలకు చట్టబద్ధత కల్పించే అంశం చేర్చడంతో గ తంలో సాదాబైనామాలకు పట్టాలు జారీ చేయాలని, దరఖాస్తు చేసుకు న్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. వ్య వసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ధరలు అధికంగా ఉండటంతో చిన్న సన్న కారు రైతులు సాదాబైనామా లకు చట్టబద్ధత కల్పించే ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నా రు. 2019 నుంచి వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్‌లు రెవెన్యూ కార్యాలయాల్లో సా గుతుండగా అంతకు ముందు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వాటికి రెవెన్యూ అధి కారులు మ్యుటేషన్‌ చేసి పట్టాలను జారీ చేసేవారు. ఈ తంతు వల్ల వ్య వసాయ భూములు కొనుగోలు చేసిన వారికి పట్టాల జారీలో తీవ్ర జా ప్యం ఏర్పడేది. కొత్త రెవెన్యూ చట్టం చేసిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాదా బైనామాలకు మోక్షం కల్పించలేదు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల మొర ఆలకించి కొత్త చట్టం ద్వారా సాదా బైనామాలకు పట్టాలను జారీ చేసే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చింది.

ఫమంచి నిర్ణయం తీసుకుంది

గాజెంగి నందయ్య, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, జగిత్యాల

సాదాబైనామాలకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదిం చడం మంచి నిర్ణయమే. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ రేవంత్‌ రెడ్డి సర్కారు ఏర్పడిన ఏడాదిలోగా ప్రధాన సమస్యకు పరిష్కారం చూప నుంది. ఎంతో మందికి సాదాబైనామాలకు పట్టాలు జారీ చేసే అవకాశం లభించనుంది.

ఫరైతులు రుణ పడి ఉంటారు

అల్లూరి మహేందర్‌ రెడ్డి, సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌

సాదా బైనామాలకు పట్టాలను జారీ చేయాలని ప్ర భుత్వం తీసుకున్న నిర్ణయంతో సీఎం రేవంత్‌ రెడ్డికి రైతులు రుణ పడి ఉంటారు. సాదాబైనా మాలకు పట్టాల జారీ కోసం నాలుగేళ్లుగా ఎంతో మంది ఎదురుచూ స్తు న్నారు. వారందరికి తొందరలోనే పట్టాలు జారీ అయ్యే పరిస్థితి ఏర్పడింది.

Updated Date - Dec 23 , 2024 | 01:58 AM