ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Holi Festival: హోలీ ఆడుతున్నారా.. మీ కళ్లు ఇలా కాపాడుకోండి!

ABN, Publish Date - Mar 25 , 2024 | 09:55 AM

Protection Of Eyes During Holi: హైదరాబాద్‌: హోలీ రోజు రంగుల్లో మునిగిపోతారు. రంగులు పూసే సమయంలో అవి ప్రమాదకరమైనవా.. కాదా అనే విషయాలను ఎవరూ పట్టించుకోరు. రసాయనిక రంగులతో హోలీ ఆడడం వల్ల కొన్నిసార్లు అనేక జబ్బులు వస్తున్నాయి...

హైదరాబాద్‌: హోలీ (Holi) రోజు రంగుల్లో మునిగిపోతారు. రంగులు పూసే సమయంలో అవి ప్రమాదకరమైనవా.. కాదా అనే విషయాలను ఎవరూ పట్టించుకోరు. రసాయనిక రంగులతో హోలీ ఆడడం వల్ల కొన్నిసార్లు అనేక జబ్బులు వస్తున్నాయి. నేత్ర, చర్మ, జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కంటిలో, నోటిలో, చెవిలో రంగులు పడడం వల్ల తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ రంగుల వల్ల స్వల్ప కాలిక, దీర్ఘకాలిక అనారోగ్య ఇబ్బందులు తలెత్తున్నాయి.

Holi: హోలీ రంగులను తొలగించుకునే ఈజీ చిట్కాలు!



Holi: హైదరాబాద్‌లో ఏయే ప్రాంతాల్లో హోలీ బాగా జరుపుకుంటారో తెలుసా..?


జాగ్రత్తగా ఉండాలి..

ఎంతో ఉత్సాహంగా జరుపుకునే హోలీ రంగులతో జాగ్రత్తగా ఉండాలి. హోలీ రంగులలో సీసం, క్రోమియం, పాదరసం తదితర హానికరమైన పదార్థాలుంటాయి. వీటితో కళ్లు ఎరుపుగా మారి కార్నియా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కళ్లను సురక్షితంగా కాపాడుకునేందుకు హోలీ సంబరాల్లో సేంద్రియ రంగులు ఉత్తమం. కళ్లను బలమైన స్ల్ఫాష్‌ల నుంచి రక్షించుకోవడానికి సన్‌ గ్లాసె‌స్‌ను ధరించాలి. నీటి బెలూన్‌లతో నేరుగా కొట్టడం వల్ల కంటికి గాయాలు అయ్యే అవకాశం ఉంది. కళ్లలో రంగులు పడకుండా జాగ్రత్తగా వహించాలి. ఒకవేళ పడితే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. - డాక్టర్‌ స్వప్నా షానభాగ్‌, కన్సల్టెంట్‌ నేత్ర వైద్యులు, ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 25 , 2024 | 09:55 AM

Advertising
Advertising