Hyderabad: సాంకేతిక లోపంతోనే 11 కేవీ ఫీడర్ ట్రిప్..
ABN, Publish Date - May 10 , 2024 | 10:11 AM
వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బందితో నిరంతరం అప్రమత్తంగా ఉన్నామని సైబర్‌సిటీ సర్కిల్ ఎస్‌ఈ వెంకన్న(Cybercity Circle SE Venkanna) తెలిపారు.
- వర్షాలపై అప్రమత్తంగా ఉన్నాం
- సైబర్‌సిటీ సర్కిల్ ఎస్‌ఈ వెంకన్న
- విధుల్లో నిర్లక్ష్యం వహించిన డీఈ, ఏడీఈ, ఏఈలకు మెమోలు
హైదరాబాద్ సిటీ: వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బందితో నిరంతరం అప్రమత్తంగా ఉన్నామని సైబర్‌సిటీ సర్కిల్ ఎస్‌ఈ వెంకన్న(Cybercity Circle SE Venkanna) తెలిపారు. ఈదురుగాలులతో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి భారీవృక్షాలు, కొమ్మలు విద్యుత్‌లైన్లపై పడటంతో తీగలు తెగి ఫీడర్లు ట్రిప్పయ్యాయని వివరించారు. అదే రోజు రాత్రి 8.30 నుంచి అర్థరాత్రి 12 గంటల లోపు ఫీడర్లలో మరమ్మతులు పూర్తిచేసి 98 శాతం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించామన్నారు. ఇంజనీర్స్ ఎన్‌క్లేవ్‌లో ఫీడర్‌ను మాత్రం బుధవారం ఉదయం 4 గంటలకు పునరుద్ధరించామన్నారు. రెండు డిస్ర్టిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లలో సాంకేతిక లోపంతో 11 కేవీ ఫీడర్ మరోసారి ట్రిప్పవ్వడంతో చందానగర్‌లో ప్రాంతంలో సరఫరా నిలిచిపోయిందన్నారు.
ఇదికూడా చదవండి: Jaggareddy: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ ఇవ్వండి
ముగ్గురు అధికారులకు చార్జి మెమోలు
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ రాజేంద్రనగర్ డివిజన్‌లో డీఈ, ఏడీఈ, ఏఈలకు రంగారెడ్డి జోన్ సీజీఎం చార్జ్ మెమోలు జారీచేశారు. హిమాయత్‌సాగర్ పరిధిలో విద్యుత్ తీగ తెగిపోయి అర్ధరాత్రి 50 నిమిషాలు ఓ సారి, 1.42 నిమిషాల పాటు మరోసారి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానికుల నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. అంతరాయాలపై టీఎ్‌సఎస్పీడీసీఎల్ సీఎండీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో విచారణ చేసిన అధికారులు బాధ్యులైన రాజేంద్రనగర్ డీఈ, ఏడీఈ, హిమాయత్‌సాగర్ ఏఈలకు చార్జ్‌మెమోలు జారీచేశారు. 5 నిమిషాలు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని, రెండు గంటలకు పైగా సరఫరాలో అంతరాయాలు తలెత్తినా క్షేత్రస్థాయి అధికారులు సమాచారం ఇవ్వలేదని ఉన్నతాధికారులు తెలిపారు.
ఇదికూడా చదవండి: Hyderabad: రేపు ఆఖరు.. సాయంత్రం 6 గంటలకు ముగియనున్న ప్రచారం
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - May 10 , 2024 | 10:11 AM