Hyderabad: మహాశివరాత్రికి 340 ప్రత్యేక బస్సులు.. కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగుట్టకు..
ABN, Publish Date - Mar 07 , 2024 | 11:29 AM
మహాశివరాత్రి సందర్భంగా నగరంలోని పలుప్రాంతాల నుంచి కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగుట్ట(Keesaragutta, Edupayala, Beerangutta) జాతరలకు 340 ప్రత్యేక బస్సులను గ్రేటర్ ఆర్టీసీ నడుపుతోంది.
హైదరాబాద్ సిటీ: మహాశివరాత్రి సందర్భంగా నగరంలోని పలుప్రాంతాల నుంచి కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగుట్ట(Keesaragutta, Edupayala, Beerangutta) జాతరలకు 340 ప్రత్యేక బస్సులను గ్రేటర్ ఆర్టీసీ నడుపుతోంది. నేటి నుంచి ఆదివారం వరకు ఈ సదుపాయం ఉంటుందని, ఒక్కో ప్రాంతానికి ఓ ప్రత్యేకాధికారిని నియమించామని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆఫ్జల్‌గంజ్, తార్నాక, ఈసీఐఎల్, కుషాయిగూడ, కీసర విలేజ్ పాయింట్స్ నుంచి కీసరగుట్టకు నడిపే స్పెషల్ ఆపరేషన్స్ ఇన్‌చార్జిగా కాచిగూడ డీఎం (9959226145), రాజేంద్రనగర్ (9959226147) డీఎంలను నియమించారు. రెజిమెంటల్ బజార్, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కీసరగుట్టకు నడిచే బస్సులకు కంటోన్మెంట్ డిపో మేనేజర్ (9959226143), అమ్ముగూడ, యాప్రాల్, వెంకటాపురం పాయింట్ల నుంచి కీసరగుట్టకు హకీంపేట డీఎం (9959226144), ఉప్పల్ ఎక్స్‌రోడ్ నుంచి కీసరగుట్టకు నడిపే బస్సులకు చంగిచర్ల డీఎం (7893088433) ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తారు.
కీసరగుట్టలో విచారణ కేంద్రం
గ్రేటర్‌తో పాటు పలుప్రాంతాల నుంచి కీసరగుట్టకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ కీసరగుట్టలో ఎంక్వైరీ కౌంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. మూడు షిఫ్ట్‌ల్లో ప్రయాణికులకు బస్సుల వివరాలు తెలిపేందుకు సిబ్బందిని నియమించనుంది. ప్రత్యేక బస్సుల వివరాల కోసం కోఠి (9959226160), రేతిఫైల్ బస్‌స్టేషన్ (9959226154)లలోని కమ్యూనికేషన్ సెంటర్లలో సంప్రదించవచ్చని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.
Updated Date - Mar 07 , 2024 | 11:31 AM