మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: రణరంగంగా హెచ్‌సీయూ.. ఏబీవీపీ, ఎస్‌ఎఫ్ఐ విద్యార్థుల మధ్య ఘర్షణ

ABN, Publish Date - Apr 19 , 2024 | 09:54 AM

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(Hyderabad Central University) హాస్టల్‌లో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Hyderabad: రణరంగంగా హెచ్‌సీయూ.. ఏబీవీపీ, ఎస్‌ఎఫ్ఐ విద్యార్థుల మధ్య ఘర్షణ

- హాస్టల్‌లో అర్ధరాత్రి ఘటన.. 15 మందికి గాయాలు

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(Hyderabad Central University) హాస్టల్‌లో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వర్సిటీ జే బ్లాక్‌లో బుధవారం అర్ధరాత్రి ఏబీవీపీ, ఎస్‌ఎఫ్ఐ(ABVP, SFI) సంఘాలకు చెందిన విద్యార్థులు పరస్పరం బాహాబాహీకి దిగారు. ఇరువర్గాల వారు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేసుకున్నారు. ఇది కాస్తా ముదరడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఏబీవీపీ నాయకులు గత ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక తమ భావజాలాన్ని వ్యతిరేకించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు ఆరోపించారు.

ఇదికూడా చదవండి: Revanth Reddy: నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన

విద్యార్ధినులపై కూడా చేయిచేసుకున్నారని, అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. గొడవను ఆపేందుకు యత్నించిన సెక్యూరిటీ సిబ్బందిపై కూడా చేయిచేసుకున్నారని, దాడులు చేస్తున్న సమయంలో వీడియో తీసిన వారిని బెదిరించి, వీడియోలు డిలీట్‌ చేయించారని ఆరోపించారు. వర్సిటీలో విద్యార్థులపై తరచు దాడులకు పాల్పడుతున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వీసీ కార్యాలయం ముందు గురువారం నిరసన తెలిపారు. ఇదిలా ఉండగా హస్టల్‌లో గొడవ జరగడానికి ఎస్‌ఎఫ్ఐ నాయకులే కారణమని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు.

city3.2.jpg

ఇదికూడా చదవండి: Telangana: విపక్షాలు జేబులో.. లేదా జైల్లో ఉండాలి: కేటీఆర్

Updated Date - Apr 19 , 2024 | 09:54 AM

Advertising
Advertising