ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలి.. వామపక్ష పార్టీల డిమాండ్‌

ABN, Publish Date - Jul 02 , 2024 | 04:06 AM

బొగ్గు గనుల వేలంపాటను రద్దు చేయాలని, బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. తెలంగాణ రాష్ట్ర వామపక్ష పార్టీల సమావేశం సోమవారం హైదరాబాద్‌ ఎంబీ భవన్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.

  • జూలై 5న నిరసనలకు పిలుపు

హైదరాబాద్‌, జూలై 1(ఆంధ్రజ్యోతి): బొగ్గు గనుల వేలంపాటను రద్దు చేయాలని, బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. తెలంగాణ రాష్ట్ర వామపక్ష పార్టీల సమావేశం సోమవారం హైదరాబాద్‌ ఎంబీ భవన్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశాన్ని సీపీఐ (ఎం ఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర నాయకులు రమ అధ్యక్షతన నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు లు ఎస్‌. వీరయ్య, డీజీ నరసింహారావు, సీపీఐ నుంచి ఈటీ నరసింహా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలంపాటలకు నిరసనగా జూలై 5న అన్ని జిల్లాల కలెక్టరేట్లు, హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నాయకులు పిలుపునిచ్చారు.

Updated Date - Jul 02 , 2024 | 04:06 AM

Advertising
Advertising