ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: చల్లబడిన వాతావరణం.. మరో రెండు రోజులు ఇలాగే..

ABN, Publish Date - Apr 14 , 2024 | 08:59 AM

నగరంలో శనివారం ఉదయం పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఐదు రోజుల క్రితం వరకు 40-42 డిగ్రీలు నమోదైన పగటి ఉష్ణోగ్రతలు రెండురోజులుగా 36-37 డిగ్రీలకు తగ్గాయి. దీంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత తగ్గిపోయింది.

హైదరాబాద్‌ సిటీ: నగరంలో శనివారం ఉదయం పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఐదు రోజుల క్రితం వరకు 40-42 డిగ్రీలు నమోదైన పగటి ఉష్ణోగ్రతలు రెండురోజులుగా 36-37 డిగ్రీలకు తగ్గాయి. దీంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత తగ్గిపోయింది. రాత్రిళ్లు చలిగాలుల ప్రభావం పెరగడంతో నగరవాసులకు కాస్త ఉపశమనం దొరికింది. మరో రెండురోజుల పాటు నగరంలో ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు(Begumpet Meteorological Department officials) తెలిపారు. ఆది, సోమవారాల్లో గరిష్ఠంగా 36, కనిష్ఠంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలుంటాయన్నారు. గాలులు ఆగ్నేయ దిశగా గంటలకు 6-10 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంటుందని తెలిపారు. శనివారం మౌలాలి - 37.6, గణాంకభవన్‌- 35.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇదికూడా చదవండి: Danakishore: నీటి సరఫరాకు ఆటంకం కలిగించే సిబ్బందిని తొలగిస్తాం..

Updated Date - Apr 14 , 2024 | 08:59 AM

Advertising
Advertising