Hyderabad: గండిపేట కాలువకు గండి.. వృథాగా పోతున్న తాగునీరు
ABN, Publish Date - Apr 02 , 2024 | 01:01 PM
చారిత్రక గండిపేట(Gandipet) కాలువకు ప్రమాదం ఏర్పడింది. కోకాపేట్ ప్రాంతంలో కాలువ కొంత మేరకు కూలిపోవడంతో తాగునీరు వృథాగా పోతోంది. చెరువు అలుగు మాదిరిగా కాలువ నుంచి నీరు బయటకు ప్రవహిస్తోంది.
హైదరాబాద్: చారిత్రక గండిపేట(Gandipet) కాలువకు ప్రమాదం ఏర్పడింది. కోకాపేట్ ప్రాంతంలో కాలువ కొంత మేరకు కూలిపోవడంతో తాగునీరు వృథాగా పోతోంది. చెరువు అలుగు మాదిరిగా కాలువ నుంచి నీరు బయటకు ప్రవహిస్తోంది. భాగ్యనగరానికి ఇప్పటికీ గండిపేట ద్వారా తాగునీరు అందుతోంది. గండిపేట కాలవ నుంచి షేక్‌పేట్, మెహిదీపట్నం ఫిల్టర్‌బెడ్స్‌కి తరలించి, అక్కడి నుంచి పలు ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తారు. గండిపేట కాలువకు ముప్పు వాటిళ్లడం ఆందోళన కలిగిస్తోంది. గండిపేట పరిరక్షణ కోసం జలమండలిలో ప్రత్యేక బృందం ఉంది. జీఎం, డీజీఎం, మేనేజర్ స్థాయి అధికారులు ఉన్నారు. ఇంత మంది ఉన్నా భారీ స్థాయిలో నీరు వృథాగా పోతున్నా పట్టించుకోక పోవడం విడ్డూరం.
Updated Date - Apr 02 , 2024 | 01:01 PM