మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: బండ్ల గణేశ్‌కు నా ఇంటిని అద్దెకిచ్చాను.. దాన్ని చూసేందుకు వెళ్తే ఆక్రమణ అంటూ కేసు పెట్టారు..

ABN, Publish Date - Feb 18 , 2024 | 12:42 PM

‘బండ్ల గణేశ్‌(Bandla Ganesh)కు నా ఇంటిని అద్దెకు ఇచ్చాను.. నా ఇంటిని చూసేందుకు వెళ్లగా ఆక్రమణ అంటూ కేసు పెట్టారు’ అని హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఎండి నౌహీరాషేక్‌(MD Nauhirashek) ఆరోపించారు.

Hyderabad: బండ్ల గణేశ్‌కు నా ఇంటిని అద్దెకిచ్చాను.. దాన్ని చూసేందుకు వెళ్తే ఆక్రమణ అంటూ కేసు పెట్టారు..

హైదరాబా: ‘బండ్ల గణేశ్‌(Bandla Ganesh)కు నా ఇంటిని అద్దెకు ఇచ్చాను.. నా ఇంటిని చూసేందుకు వెళ్లగా ఆక్రమణ అంటూ కేసు పెట్టారు’ అని హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఎండి నౌహీరాషేక్‌(MD Nauhirashek) ఆరోపించారు. బంజారాహిల్స్‌లోని తమ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రూ.75 కోట్ల విలువ చేసే తన ఇంటిని కబ్జా చేసేందుకు బండ్ల గణేశ్‌ స్కెచ్‌ వేసాడని ఆమె ఆరోపించారు. ఇంట్లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని తెలియడంతో వాస్తవాలు తెలుసుకునేందుకు వెళ్లామని, తాము అక్కడ ఉండగానే పోలీసులు వచ్చి కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు తెలుసంటూ బండ్ల గణేశ్‌ తమముందే ఫోన్‌లు చేశాడన్నారు. ఇంటిపై పదకొండు నెలల రెంట్‌ అగ్రిమెంట్‌ను బండ్ల గణేశ్‌ ఫోర్జరీ చేశాడని, దీనిపై తమకు సుపీరంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఫిలింనగర్‌ పోలీసుల తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొన్నారు.

city8.3.jpg

Updated Date - Feb 18 , 2024 | 12:42 PM

Advertising
Advertising