Hyderabad: రిమాండ్ ఖైదీ కడుపులో ఇనుప మేకులు...
ABN, Publish Date - Apr 21 , 2024 | 09:36 AM
ఓ ఖైదీ కడుపులో ఏకంగా తొమ్మిది ఇనుప మేకులు(Iron nails) బయటపడ్డాయి. పొడుగ్గా ఉన్న వీటిని గాంధీ వైద్యులు తొలగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. చర్లపల్లి జైలు(Charlapally Jail)లో రిమాండ్ ఖైదీగా ఉన్న మహ్మద్ షేక్ (32) తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండగా జైలు వైద్యుల సూచనల మేరకు ఈ నెల 16న వైద్యపరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
- శస్త్ర చికిత్సతో బయటికి తీసిన గాంధీ వైద్యులు
హైదరాబాద్: ఓ ఖైదీ కడుపులో ఏకంగా తొమ్మిది ఇనుప మేకులు(Iron nails) బయటపడ్డాయి. పొడుగ్గా ఉన్న వీటిని గాంధీ వైద్యులు తొలగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. చర్లపల్లి జైలు(Charlapally Jail)లో రిమాండ్ ఖైదీగా ఉన్న మహ్మద్ షేక్ (32) తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండగా జైలు వైద్యుల సూచనల మేరకు ఈ నెల 16న వైద్యపరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని మొదటి అంతస్తులో ప్రిజనర్స్ ఖైదీ వార్డులో చేర్పించారు. కడుపు నొప్పి తీవ్రం కావడంతో గాంధీ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ శ్రవణ్‌కుమార్(Professor Shravan Kumar) నేతృత్వంలో శనివారం ఖైదీకి పలుసార్లు రక్త, వైద్య పరీక్షలు చేశారు.
ఇదికూడా చదవండి: బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిస్తే.. పార్టీ మారరని చెప్పగలరా?
ఎండోస్కోపీ ద్వారా కడుపులో ఇనుప మేకులు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 45 నిమిషాల పాటు గ్యాస్ట్రో విభాగాధిపతి ప్రొఫెసర్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యులు ఎండోస్కోపీ ద్వారా తొమ్మిది మేకులను బయటికి తీశారు. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రాణాలకే ముప్పు ఉండేదని వైద్యులు తెలిపారు. శ్రమించి ఖైదీ ప్రాణాలు కాపాడిన ప్రొఫెసర్ శ్రవణ్‌కుమార్‌తో పాటు వైద్యుల్ని తోటి వైద్యులు అభినందించారు. అయితే, ఖైదీ ఇనుప మేకులు ఎందుకు మింగాడనే విషయం తెలియరాలేదు.
ఇదికూడా చదవండి: CP Srinivasa Reddy: పండగలను ప్రశాంతంగా జరుపుకోవాలి
Updated Date - Apr 21 , 2024 | 09:37 AM