ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: మియాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్‌.. కారణం ఏంటో తెలుసా..

ABN, First Publish Date - 2024-02-07T11:13:34+05:30

ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు మియాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌(Miyapur Inspector Premkumar)ను సైబరాబాద్‌ సీపీ సస్పెండ్‌ చేశారు.

మియాపూర్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు మియాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌(Miyapur Inspector Premkumar)ను సైబరాబాద్‌ సీపీ సస్పెండ్‌ చేశారు. 2023 అక్టోబరులో ఓ మహిళ స్టేషనుకు వచ్చి తన భర్త వేధింపులు భరించలేకపోతున్నానని ఫిర్యాదు చేసింది. సదరు భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, వాట్సాప్‌ చాటింగ్‌, ఫోన్‌ రికార్డులతో వేధిస్తున్నాడని ఆ మహిళ సైబరాబాద్‌ కమిషనర్‌ మహంతికి ఫిర్యాదు చేసింది. దాంతో విచారణ చేపట్టిన అధికారులు అది నిజమేనని తేలడంతో ప్రేమ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. భూవివాద దందాలు, ఇతర కేసుల్లోనూ ప్రేమ్‌కుమార్‌పై పలు ఆరోపణలు ఉన్నట్లు అధికారుల విచారణలో బయటపడినట్లు సమాచారం.

Updated Date - 2024-02-07T11:13:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising