ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: అక్కడ.. రాజకీయ ప్రసంగాలు ఉండొద్దు..

ABN, Publish Date - Apr 13 , 2024 | 07:58 AM

ఈనెల 17న జరగబోయే శ్రీరామ శోభాయాత్ర మార్గాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి(City Police Commissioner K. Srinivas Reddy) సందర్శించి రూట్‌ మ్యాప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా శోభాయాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిర్వాహకులకు సూచించారు.

- శ్రీరామ శోభాయాత్ర నిర్వాహకులకు సీపీ సూచనలు

- యాత్ర రూట్‌మ్యాప్‌ పరిశీలన

హైదరాబాద్: ఈనెల 17న జరగబోయే శ్రీరామ శోభాయాత్ర మార్గాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి(City Police Commissioner K. Srinivas Reddy) సందర్శించి రూట్‌ మ్యాప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా శోభాయాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిర్వాహకులకు సూచించారు. ఇతర వర్గాలను కించపరిచే విధంగా పాటలు, ఎన్నికల ప్రసంగాలు చేయకూడదన్నారు. శోభాయాత్ర సీతారాంబాగ్‌ ద్రౌపతి గార్డెన్‌ నుంచి ప్రారంభమై మంగళ్‌హాట్‌, ధూల్‌పేట్‌(Mangalhat, Dhulpet), పురానాపూల్‌, జుమ్మెరాత్‌ బజార్‌, బేగంబజార్‌ ఛత్రి, గోల్‌మజీద్‌, గౌలిగూడ, పుత్లిబౌలి, కోఠి, ఆంధ్రా బ్యాంక్‌, సుల్తాన్‌బజార్‌ మీదుగా హనుమాన్‌ వ్యాయామశాల వరకు కొనసాగుతుంది. ఎన్నికల కోడ్‌ ఉన్నందున శోభాయాత్రను అనుకున్న సమయంలో ప్రారంభించి రాత్రి 10 గంటలకల్లా ముగించడానికి నిర్వాహకులు సహకరించాలని సీపీ కోరారు. కమాండ్‌ కంట్రోల్‌ నుంచి, సీసీ కెమెరాలు, డ్రోన్లతో యాత్రను ప్రతి క్షణం పర్వవేక్షిస్తామన్నారు. యాత్రలో పాల్గొనే భక్తులకు మంచినీటి సరఫరా, మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పారు. కోడ్‌ అమలులో ఉన్నందున నిర్వాహకులు పార్టీలకు సంబంధించిన గుర్తులు వాడకుండా జాగ్రత్తలు పాటించాలని సీపీ కొత్తకోట హెచ్చరించారు. సమావేశంలో పోలీస్‌ ఉన్నతాధికారులు, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు, శోభాయాత్ర నిర్వాహకులు పాల్గొన్నారు. అలాగే.. ఆన్‌లైన్‌లో అధికారులతో కూడా సీపీ సమావేశం నిర్వహించి బందోబస్తుపై సిబ్బందికి తగిన సూచనలు చేశారు.

ఇదికూడా చదవండి: Hyderabad: గ్రేటర్‌ ఆర్టీసీకి భారంగా ‘మహాలక్ష్మి’

Updated Date - Apr 13 , 2024 | 08:01 AM

Advertising
Advertising