ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: బిల్లులు లేకుండానే మందుల క్రయవిక్రయాలు

ABN, Publish Date - Mar 21 , 2024 | 11:19 AM

నగరంలో పలు హోల్‌సేల్‌ మెడికల్‌ షాపులపై డ్రగ్‌ కంట్రోల్‌(Drug control) అధికారులు దాడులు నిర్వహించారు. ఢిల్లీ నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా ఇన్సులిన్‌ ఇంజక్షన్‌లు, మందులు కొనుగోలు చేసి, వాటిని 40 శాతం డిస్కౌంట్‌కు విక్రయిస్తున్న 6 మెడికల్‌ దుకాణాలపై కేసులు నమోదు చేశారు.

- మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్‌లపై దాడులతో వెలుగులోకి..

- అనుమతి లేకుండా ఇన్సులిన్‌, ఆక్సిటోసిలిన్‌ ఇంజక్షన్‌ల అమ్మకం

హైదరాబాద్‌ సిటీ: నగరంలో పలు హోల్‌సేల్‌ మెడికల్‌ షాపులపై డ్రగ్‌ కంట్రోల్‌(Drug control) అధికారులు దాడులు నిర్వహించారు. ఢిల్లీ నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా ఇన్సులిన్‌ ఇంజక్షన్‌లు, మందులు కొనుగోలు చేసి, వాటిని 40 శాతం డిస్కౌంట్‌కు విక్రయిస్తున్న 6 మెడికల్‌ దుకాణాలపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా అనుమతి లేకుండా ఆక్సిటోసిలిన్‌ ఇంజక్షన్‌లు, ఇతర ఔషధాలను నిల్వ ఉంచిన దుకాణాలపై కేసులు పెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా పలు హోల్‌సేల్‌ మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్‌ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన డీసీఏ అధికారులు 6 హోల్‌సేల్‌ మెడికల్‌ దుకాణాలపై కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి రూ.51 లక్షల విలువైన మందులు, ఇంజక్షన్‌లు స్వాధీనం చేసుకున్నారు. బాలాపూర్‌(Balapur)లోని సలార్‌ బిన్‌ మహమూద్‌ నిర్వహిస్తున్న దుకాణంలో ఆక్సిటోసిలిన్‌ ఇంజక్షన్‌లు, సుచిత్ర కాలనీ, మల్కాజిగిరిలో నిర్వహిస్తున్న దుకాణంపై దాడి చేసి నిర్వాహకుడు బోడసు రామానుజమ్‌లపై కేసులు నమోదు చేశారు. ఢిల్లీ నుంచి బిల్లులు లేకుండా ఇన్సులిన్‌ ఇంజక్షన్‌లు కొనుగోలు చేసి విక్రయిస్తున్న మెడికల్‌ దుకాణాలపై కేసులు నమోదు చేశారు. సికింద్రాబాద్‌ దుర్గా హబ్‌ మెడికల్‌ దుకాణంలో 6.7 లక్షల స్టాక్‌, ఉప్పల్‌లోని శ్రీ తిరుమల ఫార్మా మెడికల్‌ షాపులో 3.52 లక్షల మందులు, సుల్తాన్‌బజార్‌ శ్రీ పరస్‌ మెడికల్‌ ఏజెన్సీలో రూ.9 లక్షల విలువైన మందులు, నాగోలులోని శ్రీగణేష్‌ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్‌ వద్ద రూ. 14 లక్షల విలువైన మందులు, కాప్రాలోని శ్రీ రాజరాజేశ్వర డిస్ట్రిబ్యూటర్స్‌ వద్ద రూ. 2.70 లక్షలు, కాచిగూడలోని శ్రీబాలజీ ఏజెన్సీ్‌సలో రూ.16 లక్షల మందుల స్టాక్‌ను సీజ్‌ చేశారు. ఆయా మెడికల్‌ షాపులపై కేసులు నమోదు చేసిన డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - Mar 21 , 2024 | 11:19 AM

Advertising
Advertising