Hyderabad: కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రత్యేక శిబిరం
ABN, Publish Date - Jan 19 , 2024 | 12:16 PM
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా గురువారం ఖైరతాబాద్(Khairatabad)లో కేంద్ర ప్రభుత్వ పథకాలను రిజిస్టర్ చేసుకునే ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు.
ఖైరతాబాద్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా గురువారం ఖైరతాబాద్(Khairatabad)లో కేంద్ర ప్రభుత్వ పథకాలను రిజిస్టర్ చేసుకునే ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. గ్రంథాలయ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది స్థానికులు ముద్ర లోన్లు, జీరో బ్యాలన్స్ బ్యాంక్ ఖాతాలు, ఆయుష్మాన్ భారత్, ఆధార్ నమోదు, సవరణలు, ఉజ్వల గ్యాస్ కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ శిబిరాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాడి ప్యూటీ జీఎం ప్రఫుల్ల కుమార్ జనా ప్రారంభించి సేవల ను వివరించారు. ఇందులో ప్రధాన మంత్రి మోదీ ప్రభుత్వ పథకాలపై చేసిన ప్రసంగాన్ని వీక్షించే ఏర్పాట్లు చేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి(Chintala Ramachandra Reddy) శిబిరా న్ని సందర్శించి కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. బీజేపీ నాయకులు ప్రేంరాజ్, వెంకటరెడ్డి, రామ్మెహన్‌రావు, నగేష్, ఆదర్శ్, వీణా మాధురి, లాల్ హీరా, వైద్యనాథ్, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jan 19 , 2024 | 12:16 PM