ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad Techie: యూఎస్‌ వీసా ఇంటర్వ్యూ స్లాట్‌కు 470 రోజుల వెయిటింగ్‌!

ABN, Publish Date - Aug 23 , 2024 | 02:58 AM

అమెరికా వెళ్లాలనుకుంటున్నారా? వీసా ఇంటర్వ్యూ స్లాట్‌ కోసం వేచి చేస్తున్నారా? అయితే మీకు స్లాట్‌ దొరికేందుకు చాలా కాలం పట్టవచ్చు.

  • హైదరాబాద్‌ టెకీకి ఎదురైన అనుభవం

హైదరాబాద్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): అమెరికా వెళ్లాలనుకుంటున్నారా? వీసా ఇంటర్వ్యూ స్లాట్‌ కోసం వేచి చేస్తున్నారా? అయితే మీకు స్లాట్‌ దొరికేందుకు చాలా కాలం పట్టవచ్చు. హైదరాబాద్‌కు చెందిన ఓ టెకీ తన స్నేహితుడి కోసం యూఎస్‌ వీసా ఇంటర్వ్యూ స్లాట్‌ కోసం ప్రయత్నిస్తే 470 రోజుల వెయిటింగ్‌ చూపింది. అమిత్‌ భవానీ అనే వ్యక్తికి ఈ అనుభవం ఎదురైంది.


ఆయన తన అనుభవాన్ని తన ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. ఈ పోస్ట్‌ చూసిన తర్వాత చాలా మంది ఆయనకు రకరకాల సలహాలు ఇచ్చారు. ఏజెంట్లకు కొంత మొత్తం డబ్బు చెల్లిస్తే స్లాట్‌లు అందిపుచ్చుకోవడం ఈజీ అని పేర్కొన్నారు. అయితే తాను పోస్టు చేసిన మరో 24 గంటలకు అమిత్‌ మరో పోస్ట్‌ చేస్తూ ‘‘ఎట్టకేలకు ఒక రోజంతా ప్రయత్నించి ఆగస్టు 26న స్లాట్‌ సంపాదించగలిగా’’నని తెలిపాడు. ఏజెంట్లకు పైసా చెల్లించకుండానే ఇది సాధ్యమైందన్నారు.

Updated Date - Aug 23 , 2024 | 02:58 AM

Advertising
Advertising
<