మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: అడుగంటుతున్న నాగార్జునసాగర్‌.. అత్యవసర నీటి పంపింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

ABN, Publish Date - Mar 10 , 2024 | 12:29 PM

హైదరాబాద్‌ మహా నగర దాహార్తి తీర్చడంలో కీలకంగా మారిన కృష్ణా జలాలు నాగార్జునసాగర్‌(Nagarjunasagar)లో ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయి.

Hyderabad: అడుగంటుతున్న నాగార్జునసాగర్‌.. అత్యవసర నీటి పంపింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

- నెలాఖరుకు ప్రారంభించే అవకాశం

- ప్రస్తుత నీటిమట్టం 514 అడుగులు

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ మహా నగర దాహార్తి తీర్చడంలో కీలకంగా మారిన కృష్ణా జలాలు నాగార్జునసాగర్‌(Nagarjunasagar)లో ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయి. నాగార్జునసాగర్‌ నుంచి ప్రతిరోజూ హైదరాబాద్‌కు సరఫరా అయ్యే 270ఎంజీడీ (మిలియన్‌ గ్యాలన్లు పర్‌ డే)ల నీళ్లు ఆగిపోకుండా వాటర్‌బోర్డు అప్రమత్తమైంది. సాగర్‌లో నీటిమట్టం ప్రస్తుతం 514అడుగులు కాగా, మరో నాలుగు అడుగులు తగ్గితే జలాల తరలింపు ఆగిపోనున్నది. సాగర్‌లో నీటిమట్టం పడిపోతే కృష్ణా జలాల సరఫరా జరిగేందుకు వాటర్‌బోర్డు ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌(Greater Hyderabad)తో పాటు ఔటర్‌ పరిధిలోని అత్యధిక ప్రాంతాలకు కృష్ణా జలాలే ఆధారం. సాగర్‌ సమీపంలో పుట్టంగండి పంప్‌హౌస్‌, అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు. నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. అయితే, 510 అడుగులకు నీటిమట్టం పడిపోతే అక్కంపల్లి రిజర్వాయర్‌లోకి గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు రావు. దాంతో నగరానికి కృష్ణాజలాల తరలింపు ఆగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. గతేడాది కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో సరైన వర్షాలు లేకపోవడంతో ఆశించిన స్థాయిలో నాగార్జునసాగర్‌లోకి నీళ్లు రాలేదు. నీటిమట్టం పెరగలేదు.

పంపింగ్‌ కోసం భారీ మోటార్లు

నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 510అడుగులకు చేరగానే అత్యవసర పంపింగ్‌ ప్రారంభించేందుకు వాటర్‌బోర్డు అధికారులు చర్యలు చేపట్టారు. సుమారు నాలుగు కోట్ల వ్యయంతో పనులను వాటర్‌బోర్డు ట్రాన్స్‌మిషన్‌ విభాగం చేపట్టింది. మోటార్లకు మరమ్మతులు, విద్యుత్‌సరఫరా ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసర పంపింగ్‌ చేయడానికి భారీ మోటార్లను అమర్చేందుకు సాగర్‌లో కాంక్రీట్‌ దిమ్మెలను ఏర్పా టు చేశారు. నీటిమట్టం 512అడుగులకు చేరగానే బయటకు కనిపించే దిమ్మెలపై మోటర్లను పెట్టి విద్యుత్‌ సరఫరా ఏర్పాట్లు చేయనున్నారు. అందుకు ప్రాథమిక పనులను ఇప్పటికే కోదండాపూర్‌లోని వాటర్‌బోర్డు ట్రిట్‌మెంట్‌ప్లాంట్‌ వద్ద చేపడుతున్నారు.

అత్యవసర పంపింగ్‌ ఇలా..

నాగార్జునసాగర్‌ బ్యాక్‌వాటర్‌ ద్వారా పుట్టగండి చానల్‌ ద్వారా అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ జలాశయంలోకి నీటిని పంపింగ్‌ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్‌ నుంచి నీటిని సేకరించి కోదండాపూర్‌ రిజర్వాయర్‌కు తరలిస్తారు. అక్కడ శుద్ధి చేసిన నీటిని మూడు ఫేజ్‌ల్లో నగరానికి తరలిస్తారు. 510అడుగులకు నీటిమట్టం పడిపోయిన వెంటనే నగరానికి అత్యవసరం పంపింగ్‌ను వాటర్‌బోర్డు ప్రారంభిస్తుంది. ఇరిగేషన్‌ శాఖతో సమన్వయం చేసుకుంటూ కృష్ణాజలాల తరలింపు ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాల్సి ఉంటుంది. ఇబ్బందులు తలెత్తితే నీటి సరఫరా నిలిచిపోనుంది.

Updated Date - Mar 10 , 2024 | 12:35 PM

Advertising
Advertising