ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: నగరంలో భానుడి భగ.. భగలు.. మూసాపేట బాలాజీనగర్‌లో 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

ABN, Publish Date - Apr 16 , 2024 | 08:51 AM

భానుడు మళ్లీ భగ్గుమంటున్నాడు. రెండురోజులుగా కొంతమేర తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు సోమవారం పెరిగాయి. దీంతో గ్రేటర్‌వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సోమవారం మూసాపేట బాలాజీనగర్‌(Musapet Balajinagar)లో 41.5, షేక్‌పేటలో 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

హైదరాబాద్‌ సిటీ: భానుడు మళ్లీ భగ్గుమంటున్నాడు. రెండురోజులుగా కొంతమేర తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు సోమవారం పెరిగాయి. దీంతో గ్రేటర్‌వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సోమవారం మూసాపేట బాలాజీనగర్‌(Musapet Balajinagar)లో 41.5, షేక్‌పేటలో 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల తీవ్రత పెరగడంతో ప్రజలు బయట తిరిగేందుకు ఇబ్బందులు పడ్డారు. గ్రేటర్‌తో పాటు పలు జిల్లాల్లో మరో రెండురోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలుంటాయని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

మధ్యాహ్న వేళల్లో బస్సుల ట్రిప్పులు తగ్గింపు

భానుడి భగ..భగలతో రేపటి నుంచి మధ్యాహ్న సమయంలో బస్సుల ట్రిప్పులు స్వల్పంగా తగ్గిస్తున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం నుంచి ట్రిప్పులు కొంతమేర కుదిస్తున్నట్లు తెలిపారు. ఎండల తీవ్రత తగ్గే వరకు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రిప్పులను తగ్గించి సాయంత్రం నాలుగు గంటల తర్వాత బస్సులు యథాతథంగా నడుపుతామన్నారు.

ఇదికూడా చదవండి: Wine Shops: హైదరాబాద్‌లో 24 గంటలపాటు మద్యం దుకాణాలు బంద్‌.. కారణమిదే..!?

పలు ప్రాంతాల్లో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు

- న్యూ మెట్టుగూడ-41.3

- హెచ్‌సీయూ- 41.3

- యాకుత్‌పురా- 41.3

- ముషీరాబాద్‌-41.3

- చార్మినార్‌- 41.1

- అల్వాల్‌ అంబేడ్కర్‌ నగర్‌-41.1

ఇదికూడా చదవండి: Sriramanavami: శ్రీరామనవమికి ముస్తాబైన భద్రాద్రి..

Updated Date - Apr 16 , 2024 | 01:51 PM

Advertising
Advertising