Miyapur: 220 కేవీ కేబుల్ మంటల్లో దగ్ధం.. ఘటనపై పోలీసుల అనుమానం
ABN, Publish Date - May 12 , 2024 | 03:20 PM
మియాపూర్(Miyapur) ఈహెచ్టీ సబ్ స్టేషన్లో(EHT Sub Station) 220 కేవీ కేబుల్ మంటల్లో దగ్ధమవ్వడం అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం ఉదయం మియాపూర్‌లో రాయదుర్గ్ - మియాపూర్ 220 కేవీ కేబుల్ అనుమానాస్పద రీతిలో కాలిపోయింది.
శేరిలింగంపల్లి: మియాపూర్(Miyapur) ఈహెచ్టీ సబ్ స్టేషన్లో(EHT Sub Station) 220 కేవీ కేబుల్ మంటల్లో దగ్ధమవ్వడం అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం ఉదయం మియాపూర్‌లో రాయదుర్గ్ - మియాపూర్ 220 కేవీ కేబుల్ అనుమానాస్పద రీతిలో కాలిపోయింది.
దీంతో కైతలాపూర్, మియాపూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మంటలు చెలరేగడాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే ప్రత్యామ్నాయ సర్క్యూట్ ద్వారా సరఫరా పునరుద్ధరించారు. నగరంలో అత్యధిక డిమాండ్ ఉన్నప్పుడే ఇలాంటి ప్రమాదాలు జరగలేదు.
ఉదయం పూట డిమాండ్ అతి తక్కువగా ఉన్నప్పుడు ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఘటనపై తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ రిజ్వీ విచారణకు ఆదేశించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని దక్షిణ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరుకి పరిశీలించారు.
ఘటన ప్రభావం విద్యుత్ సరఫరాపై పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. సిబ్బంది అధికారులు నిరంతరం అప్రమత్తంగా వుండాలని, సబ్ స్టేషన్లు, ఇతర పీటీఆర్‌ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి:
Delhi: కేంద్రంలో ‘ఇండియా’ సర్కారు: కేజ్రీవాల్
Varanasi : గంగా హారతిలో పాల్గొన్న అమిత్‌షా, యోగి ఆదిత్యనాథ్
Read Latest National News and Telugu News
Updated Date - May 12 , 2024 | 03:20 PM