ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: రోడ్డు పక్కన గోనెసంచి.. ఓపెన్ చేయగా గుండె గుభేల్..

ABN, Publish Date - Oct 15 , 2024 | 08:15 PM

3 రోజుల క్రితం అదృశ్యమైన పాప శవంగా ప్రత్యక్షమైంది. కన్నబిడ్డ మరణాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడుస్తున్నారు. తమ బిడ్డ ఇక తిరిగి రాదనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషాద ఘ‌ట‌న సూరారంలో జరిగింది.

హైదరాబాద్: 3 రోజుల క్రితం అదృశ్యమైన పాప శవంగా ప్రత్యక్షమైంది. కన్నబిడ్డ మరణాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడుస్తున్నారు. తమ బిడ్డ ఇక తిరిగి రాదనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషాద ఘ‌ట‌న సూరారంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌కు చెందిన దంపతులు బ‌తుకుదెరువు కోసం 7 ఏళ్ల పాపతో క‌లిసి హైద‌రాబాద్‌లోని సూరారం వ‌చ్చారు. ఏడు నెల‌లుగా ఇక్కడే నివాసిస్తున్నారు. అయితే అక్టోబ‌ర్ 12న వారి పాప కనిపించకుండా పోయింది. బిడ్డ ఆచూకీ కోసం తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. ఎంతకూ దొరకక పోవడంతో ఆందోళన చెంది సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దంపతుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం పలు బృందాలు క్షేత్ర స్థాయిలో పాప ఆచూకీ కోసం వెతకసాగాయి.


గుండ్ల పోచంపల్లి వద్ద..

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లిలో ఓ గోన సంచిలో గుర్తు తెలియని మృతదేహం ఉన్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. వారు వెంటనే పోలీసులకు స‌మాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గోనె సంచిని తెరిచి చూశారు. తప్పిపోయిన బాలిక మృతదేహమేనని నిర్ధారించారు. అనంతరం బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు.


హుటాహుటిన అక్కడికి చేరుకున్న దంపతులు విగతజీవిగా పడి ఉన్న ఆమె మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. బాలిక మృత‌దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆమెను అత్యాచారం చేసి హ‌త్య చేశారా, లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు. దర్యాప్తులో భాగంగా సూరారం నుంచి గుండ్లపోచంపల్లి దారిలో ఉన్న సీసీటీవీ ఫుటేజీల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకుని కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు తెలిపారు.

Rajnath Singh: దేశ భద్రత విషయంలో రాజకీయాలు తగవు: రాజ్ నాథ్ సింగ్

CM Revanth: రాజకీయాలకతీతంగా అభివృద్ధికి సహకరిస్తాం: సీఎం రేవంత్

ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 15 , 2024 | 08:18 PM