TG News: ఆలయంలో ప్రదక్షణలు చేస్తుండగా హఠాత్తుగా..
ABN, Publish Date - Nov 12 , 2024 | 09:48 AM
Telangana: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌పీ కాలనీలో అనుకోని ఘటనచోటు చేసుకుంది. ఓ యువకుడు ఆలయంలో ప్రదక్షణలు చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలి పడిపోయాడు. వెంటనే తోటి భక్తులు యువకుడిని ఆస్పత్రికి తరలించగా...
ప్రమాదం ఎలా పొంచివస్తుందో ఎవరికి తెలియదు. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండా ఉన్న ప్రదేశంలో కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. దేశ వ్యాప్తంగా ఈ తరహా ఘటనలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి. సాధారణంగా గుండెపోటు వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో కొన్ని సంకేతాలు బయటపడతాయి. సకాలంలో స్పందించి చికిత్స అందిస్తే ప్రాణాలతో బయటపడే సందర్భాలు ఉంటాయి. తాజాగా కూకట్‌పల్లిలోని ఓ ఆలయంలో ప్రదక్షణలు చేస్తూ ఓ వ్యక్తి కుప్పకూలి పడిపోయాడు. తోటి భక్తులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Hyderabad: ‘ఈవెనింగ్ బీటెక్’కు అరకొరగానే అడ్మిషన్లు
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి గుడికి వెళ్లాడు. మనసారా దేవుడిని స్మరించుకుంటూ ప్రదక్షణలు చేశాడు. అయితే అతనికి తెలియదు కదా అదే ఆఖరి రోజు అవుతుందని. దేవుడిని తలుచుకుంటూ ఆలయంలో ప్రదక్షణలు చూస్తుండగానే అనుకోని ఆపద అతడిని చుట్టుముట్టింది. ఆలయంలో ఉన్న మిగిలిన భక్తులు కూడా యువకుడిని చూసి షాక్‌కు గురయ్యారు. ఇంతకీ యువకుడికి ఏం జరిగింది.. జరిగిన ప్రమాదం ఏంటో ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్‌లోని కేబీహెచ్‌బీలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆలయంలో ప్రదక్షణ లు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. ఆపై ప్రాణాలు కోల్పోయాడు. విష్ణువర్ధన్ (31) అనే యువకుడు స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షణలు చేస్తూ హార్ట్ స్ట్రోక్‌కు గురయ్యాడు. ప్రదిక్షణలు చేస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో నీళ్లు తాగేందుకు విష్ణువర్ధన్ ఫిల్టర్ వద్దకు వెళ్లాడు. ఆపై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి భక్తులు యువకుడిని ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే విష్ణువర్ధన్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే యువకుడు కుప్పకూలిన దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం తర్వాత విష్ణువర్ధన్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. అయితే దైవ దర్శనానికి వెళ్లిన తమ కుమారుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హార్ట్‌స్ట్రోక్.. ఇది ఎవరికి.. ఎప్పుడు వస్తుందో తెలియదు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా గుండెపోటుతో అనేకమంది ప్రాణాలు విడుస్తున్న పరిస్థితి. ఒకప్పుడు 40 ఏళ్లు దాటిన వారు గుండె పోటుకు గురవడం జరుగుతుండేది. కానీ ఇప్పుడు వయసు తారతమ్యం లేకుండానే యువత, చిన్న పిల్లలు హార్ట్‌స్ట్రోక్ బారిన పడుతున్నారు. అప్పటి వరకు సరదాగా ఉన్న వాళ్లు కాస్తా హఠాత్తుగా కుప్పకూలిపోయే ఘటనలు ఎన్నో చూశాం. క్రికెట్ ఆడుతూ, జిమ్ చేస్తూ, వాకింగ్ చేస్తూ, సరదాగా మాట్లాడుతున్న సమయాల్లో ఉన్నట్టుండి కొందరు కుప్పకూలిపోతుంటారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పుతున్నారు. అయితే వారు గుండె పోటు గురైనట్లు వైద్యులు చెప్పడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కేపీహెచ్‌బీలో చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆలయంలో ప్రదిక్షణలు చేస్తుండగా కుప్పకూలిపోయి.. వెంటనే ప్రాణాలు కోల్పోయాడు.
ఇవి కూడా చదవండి..
AP NEWS: వేట మొదలైంది.. సోషల్ మీడియా సైకోల భరతం పడుతున్న పోలీసులు
BRS: పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 12 , 2024 | 10:36 AM