ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

HMDA: శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ

ABN, Publish Date - Jan 31 , 2024 | 11:19 AM

Telangana: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. బుధవారం ఉదయం చంచల్‌గూడ జైలుకు వచ్చి ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనను చంచల్ గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలిస్తున్నారు.

హైదరాబాద్, జనవరి 31: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను (HMDA Former Director Shiva Balakrishna) ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. బుధవారం ఉదయం చంచల్‌గూడ జైలుకు వచ్చిన ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనను చంచల్ గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు జైల్లోనే శివబాలకృష్ణకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తరువాత ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. శివబాలకృష్ణను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు వేసిన పిటిషన్‌కు నాంపల్లి కోర్టు అనుమతించింది. శివబాలకృష్ణను ఎనిమిది రోజుల పాటు కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈరోజు ఉదయానే ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైలుకు చేరుకుని బాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్నారు. శివబాలకృష్ణ పేరుపై నాలుగు అకౌంట్స్ ఎస్‌బీఐ బ్యాంక్‌లో ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ.. బ్యాంకు లాకర్స్ తెరచే అవకాశం ఉంది.


కట్టలుగా నగదు.. భారీగా బంగారం..

కాగా.. హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌, ప్రస్తుత రెరా సెక్రటరీ శివబాలకృష్ణ, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలలో ఐదు రోజుల క్రితం ఏసీబీ ఆధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో.. ఎనిమిది బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు 24వ తేదీ తెల్లవారుజామున 5 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా 17 చోట్ల సోదాలు చేశారు. మణికొండలోని ఆయన నివాస గృహంలో, అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో కూడా తనిఖీలు చేశారు. 2018-2023 కాలంలో హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన శివబాలకృష్ణ.. అధికార దుర్వినియోగానికి పాల్పడడం ద్వారా కోట్లాది రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టినట్టు వచ్చిన ఆరోపణలు, వాటిపై తాజా ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో మణికొండలోని ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించి, పదికి పైగా ఐఫోన్లు.. అత్యంత ఖరీదైన 50 వాచీలు.. కట్టలు కట్టలుగా నగదు.. ఆయన బీరువాలో 5 కిలోల బంగారు నగలు, 70 ఎకరాలకు సంబంధించిన భూముల పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Jan 31 , 2024 | 11:29 AM

Advertising
Advertising