ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Actress Lavanya: నా రాజ్ తరుణ్ నాకు కావాలి: నటి లావణ్య

ABN, Publish Date - Jul 10 , 2024 | 06:38 PM

నార్సింగి పోలీసుల(Narsingi police)కు తాను ఇచ్చిన ఫిర్యాదుపై అన్ని ఆధారాలూ సమర్పించినట్లు నటి లావణ్య(Actress Lavanya) వెల్లడించారు. 170కి పైగా ఫొటోలు, మెడికల్ రిపోర్టులు పోలీసులకు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. నటి మాల్వి మల్హోత్రా(Malvi Malhotra)తోపాటు ఆమె సోదరుడిపై మొదటి ఫిర్యాదు చేశానని, నటుడు రాజ్ తరుణ్(Raj Tarun) తనను వాడుకొని మోసం చేశాడంటూ ఇవాళ(బుధవారం) ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

Actress Lavanya

హైదరాబాద్: నార్సింగి పోలీసుల(Narsingi police)కు తాను ఇచ్చిన ఫిర్యాదుపై అన్ని ఆధారాలూ సమర్పించినట్లు నటి లావణ్య(Actress Lavanya) వెల్లడించారు. 170కి పైగా ఫొటోలు, మెడికల్ రిపోర్టులు పోలీసులకు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. నటి మాల్వి మల్హోత్రా (Malvi Malhotra)తోపాటు ఆమె సోదరుడిపై మొదటి ఫిర్యాదు చేశానని, నటుడు రాజ్ తరుణ్(Raj Tarun) తనను వాడుకొని మోసం చేశాడంటూ ఇవాళ(బుధవారం) ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడారు.


ఈ సందర్భంగా నటి లావణ్య మాట్లాడుతూ.."2023 సెప్టెంబర్‌లో రాజ్ తరుణ్‌కి నాకు మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో నన్ను రెచ్చగొట్టి ఆడియోలు రికార్డు చేశాడు. నేను తిట్టిన ఆడియోలు మాత్రమే ఎడిట్ చేసి రాజ్ తరుణ్ బయటకు వదిలాడు. ఆవేశం, బాధ, కోపంలో మాట్లాడిన మాటలను ఉద్దేశపూర్వకంగా రికార్డు చేశాడు. డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేకపోయిన ఇరికించారు. మాల్వీ మల్హోత్రా, రాజ్ తరుణ్ ఇద్దరి వ్యవహారంపై అన్ని ఆధారాలు ఉన్నాయి. పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా వాళ్లిద్దరూ చెన్నైలోని ఓ హోటల్లో బస చేశారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు అందజేశాను. నా రాజ్ తరుణ్ నాకు కావాలి. చనిపోయేంత వరకూ న్యాయ పోరాటం చేస్తా. అతని వల్ల గర్భం దాల్చాను. కొన్ని కారణాలతో వల్ల అది మిస్ క్యారీ అయింది. వాటికి సంబంధించిన ఆధారాలు సైతం నార్సింగి పోలీసులకు అందజేశా" అంటూ బాధను వెల్లగక్కారు.

Updated Date - Jul 10 , 2024 | 06:40 PM

Advertising
Advertising
<