ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం సినీ ప్రముఖులు ఏం చెప్పారంటే..

ABN, Publish Date - Dec 26 , 2024 | 12:32 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌(సీసీసీ)లో ముఖ్యమంత్రితో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. హీరోలు నాగార్జున, వెంకటేశ్, నితిన్ , కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ.. దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ , కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి శీను, వీరశంకర్ , హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వశిష్ట భేటీ అయ్యారు.

CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌(సీసీసీ)లో ముఖ్యమంత్రితో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. హీరోలు నాగార్జున, వెంకటేశ్, నితిన్, కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ.. దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి శీను, వీరశంకర్, హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వశిష్ట.. నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, సురేశ్ బాబు, సుధాకర్ రెడ్డి, సి.కల్యాణ్, గోపి ఆచంట, శ్యాంప్రసాద్ రెడ్డి, బీవీఎస్ ప్రసాద్, కె.ఎల్.నారాయణ, మైత్రీ రవి, నవీన్.. సీఎంతో భేటీ అయ్యారు. మెుత్తం 36 మంది సభ్యులు రేవంత్‌తో సమావేశమై సినిమా టికెట్ రేట్లు, బెన్ ఫిట్ షోలు, సంధ్యా థియేటర్ ఘటన వంటి పలు పలు అంశాలపై చర్చించారు.


ఇకపై నో బెనిఫిట్‌ షోలు..

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవని సినీ పరిశ్రమ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అసెంబ్లీలో చెప్పిన మాటకే తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. సంధ్య థియేటర్‌ ఘటనపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసుకుందని ఆయన చెప్పారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడేది లేదని ఆయన సినీ పెద్దలకు స్పష్టం చేశారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామని చెప్పారు. అభిమానుల్ని కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే తేల్చి చెప్పారు. చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సినీ పరిశ్రమ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలని.. డ్రగ్స్‌ క్యాంపెయిన్‌, మహిళా భద్రత వంటి క్యాంపెయిన్లలో చొరవ చూపాలని సీఎం వారికి సూచించారు. టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని స్పష్టం చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. టాలీవుడ్‌కి ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.


సీఎంతో భేటీ.. సినీ ప్రముఖుల రియాక్షన్..

సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. "అందరు సీఎంలు సినిమా ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోంది. దిల్‌ రాజును ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నా. తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్‌ స్పాట్‌లు ఉన్నాయి. ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌ను హైదరాబాద్‌లో చేశారు. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరుతున్నామని" చెప్పారు.


"ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్‌ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలనేది మా కోరిక. యూనివర్సల్‌ లెవెల్‌లో స్టూడియో సెటప్‌ ఉండాలి."- హీరో నాగార్జున


"ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగానే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుంది. సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించింది. సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్‌ ఉండడం వల్ల ప్రమోషన్‌ విస్తృతంగా చేస్తున్నాం"- నటుడు మురళీ మోహన్


" తెలంగాణ ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ డెస్టినేషన్‌ చేయాలనేది మా డ్రీమ్. ప్రభుత్వ సాయంతోనే ఆ రోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్‌ కేరాఫ్‌గా ఉండాలి"- నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు


మర్రిచెన్నారెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు వల్లే సినీ పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చింది. "- దర్శకుడు త్రివిక్రమ్‌


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం సినీ ప్రముఖులు ఏం చెప్పారంటే..

KTR : ఇలాంటి బెదిరింపులకు భయపడం

Updated Date - Dec 26 , 2024 | 01:23 PM