ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS Politics: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఊరుకోం: అనిరుద్ రెడ్డి

ABN, Publish Date - Feb 05 , 2024 | 09:34 PM

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(Anirudh Reddy) హెచ్చరించారు. నీటి ప్రాజెక్టులపై అంతా చర్చించిన తర్వాతే మాట్లాడడానికి రావలని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీష్ రావు‌లను అసెంబ్లీకి రావాలని చెప్పారని అన్నారు.

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(Anirudh Reddy) హెచ్చరించారు. సోమవారం నాడు సెక్రటేరియట్ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. నీటి ప్రాజెక్టులపై అంతా చర్చించిన తర్వాతే మాట్లాడడానికి రావలని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీష్ రావు‌లను అసెంబ్లీకి రావాలని చెప్పారని అన్నారు. ప్రెస్ మీట్లకు కాదు రాజకీయాల్లోకి చదువుకొని వచ్చామన్నారు. ముఖ్య మంత్రి స్థాయి వ్యక్తి రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ మాట్లాడుతున్న తీరు సరైనది కాదని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి చెప్పు చూపించి మాట్లాడుతున్నారని.. రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుతీస్తే గులాబీ నేతలు తిరగగలుగుతారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదని.. బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న తీరు సరైనది కాదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే గులాబీ నేతలకు బుద్ది చెబుతారని హెచ్చరించారు. వారిలాగా అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలతో రాజకీయాలు చేయలేదని అనిరుద్ రెడ్డి అన్నారు.

Updated Date - Feb 05 , 2024 | 09:34 PM

Advertising
Advertising